హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి..?
ఎలా చేయాలి?
🌿ఎన్ని ప్రదక్షిణలు చేయదులచుకున్నను,
ప్రతి ప్రదక్షిణము తర్వాత ఒక చోట ఆగి
ఈ శ్లోకం చెప్పకుని తిరిగి ప్రదక్షిణము చేయవలెను.
🌸ఏ దేవాలయానికి వెళ్ళినా 3 ప్రదక్షిణాలు చేస్తాం.
కానీ హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం ఐదు ప్రదక్షిణాలు చేయాలి.
🌿'ప్రదక్షిణనమస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్షవాక్యం .
మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి.
🌸సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు.
🌿ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. . నియమాలు పాటించడం ముఖ్యం.
🌸హనుమంతునకు ప్రదక్షిణములు అంటే ఇష్టం. ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షణలు చేసేటప్పుడు ప్రతీ ప్రదక్షిణ తరువాత ఆగి..చెప్పుకోవల్సిన శ్లోకము'...
🌹ఆంజనేయం మహావీరం !
బ్రహ్మ విష్ణు శివాత్మకం !
అరుణార్కం ప్రభుం శమథం !
రామదూతం నమామ్యహం !' 🌹
🌿హనుమంతునకు ప్రదక్షిణములు రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు
27 ప్రదక్షిణములు చేయాలి.
పుష్పములు, వక్కలు, పసుపు కొమ్ములు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది.
🌸ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం..
‘‘శ్రీహనుమన్ జయ హనుమాన్
జయ జయ హనుమాన్''
🌿ఆంజనేయం మహావీరం -బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాతం -రామదూతం నమామ్యహం
🌸మర్కటేశ మహోత్సహా -సర్వశోక వినాశన శత్రూన్సంహర మాం రక్ష- శ్రియం దాపయ మే ప్రభో || అని చదువు కుంటూ ప్రదక్షిణలు చేయాలి.
🌿కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కానీ ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి
🌷 ‘‘యాక్రుత్తే రేభి: ప్రదక్షిణ ణై |
శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు'' 🌷
🌸అని జలాన్ని అక్షతలతో వదిలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మ చర్యం, శిరస్నానం , నేలపడక, సాత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి.
🌿పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం.
అందులోనూ మన్యు సూక్త అభిషేకస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు.
🌸స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి.
వారం, వారం నిత్యమూ చేయగలగడం
మరీ మంచిది.
🌷మంగళవార సేవ🌷..
🌿మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం.
🌸అంతా కుదరని వారు మూతికయినా తప్పక పూయాలి.
సింధూరార్చన చేయటం,
అరటి పండ్లు నివేదించడం చేయాలి.
🌷శనివార సేవ:..🌷
🌿హనుమంతుడు శనివారం జన్మించాడు, కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది.
నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి.
ఆరోజున అప్పాలు, వడ మాల వంటివి స్వామివారికి నివేదించి స్వామి వారి ఆశీస్సులుపొందవచ్చు.
🌹పంచ సంఖ్య..🌹
🌸హనుమంతుడుకి పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి ప్రదక్షిణాలు, నమస్కారాలు ఐదు చేయాలి. అరటిపండ్లు లేదా ఇతరములు, స్వామికి
🌿5 సంఖ్యంలో సమసర్పించడం స్వామివారికి
మరింత ప్రీతికరం...స్వస్తీ..
No comments:
Post a Comment