శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం..
మాతః సమస్త జగతాం మధుకైటభారే:
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్
సమస్త లోకములకును మాతృదేవతవు, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవు, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవు,
జగదీశ్వరివి, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవు, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అయిన ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక..
No comments:
Post a Comment