లక్ష్మి ఉండే చోట్లు, ఉండని చోట్లు మహాభారతములో చెప్పబడ్డవి. లక్ష్మి అంటే ధనమే కాదు. శుచి, శుభ్రత, సరళత, అందం - ఇట్లాంటివన్నీ. 'నిత్యమూ సత్యం చెప్పేవారు, శుచికలవారు, గురుభక్తులు, మత్తులు కానివారు, కార్యసాధకులు, స్వచ్ఛమైన మనస్సు కలవారు, మంచి కర్మలు చేసేవారు, విజ్ఞానం, తపస్సు, దానం, బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం కలవారు - నేను నివసించేచోట్లు.
నే నుండని స్థలాలు - క్రూరులు, నాస్తికులు, కృతఘ్నులు, చెడ్డబుద్ధి కలవారు
ఎంగిలి కాని పాత్రశుద్ధి కలిగిన గృహనీతి కల స్త్రీల దగ్గర ఉంటాను.
భర్తను ఎదిరించే స్త్రీ, కఠినమైన మనస్సుకలదీ, కొంపలవెంట తిరిగేదీ, ఎక్కువ నిద్రపోయేదీ ఈ స్త్రీలు నాకు నచ్చరు. ఇట్లాంటివారిలో నేనుండను.
తామరపూలతో నిండిన సరస్సులు, చెట్లు, పూలు కల తోటలలో ఉంటాను.
విశేషం: మనుషులలో పవిత్రత, ధర్మం, జ్ఞానం, సత్కర్మలుండాలి. లక్ష్మి అంటే ఇదే. కేవలం ధనం కాదు. దుర్మార్గులు, నాస్తికులు, సంఘవిద్రోహులు. వారికి డబ్బున్నా లక్ష్మి లేనివారే. స్త్రీలు గృహనీతి తప్పి చరిస్తే వారూ ద్రోహబుద్ధులే కనుక లక్ష్మి ఉండదు. ఇదంతా సాంఘికదృష్టి, వ్యక్తి ధర్మం వీటిని గురించి చెప్పినదే.
No comments:
Post a Comment