జొన్న రవ్వ – ఒక కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టేబుల్ స్పూన్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చి మిర్చి – 2, తరిగిన అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్, కరివేపాకు -ఒక రెబ్బ, చిన్నగా తరిగిన బంగాళా దుంప – 1, తరిగిన క్యారెట్ – ఒకటి, తరిగిన టమాటా – 1, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – మూడున్నర కప్పులు
జొన్న రవ్వ ఉప్మా తయారీ విధానం..
ముందుగా జొన్న రవ్వను కడిగి తగిన నీళ్లు పోసి ఒక రాత్రి అంతా లేదా 7 నుండి 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి కాగాక శనగ పప్పు, మినప పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక తరిగిన బంగాళాదుంప, క్యారెట్, టమాటా ముక్కలు వేసి కలిపి వేయించుకోవాలి. ఇవి వేగాక ఉప్పు, నీళ్లు వేసి కాలిపి నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టుకున్న జొన్న రవ్వను వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి.
జొన్న రవ్వ పూర్తిగా ఊడికి దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎంతో రుచిగా ఉంటే జొన్న రవ్వ ఉప్మా తయారవుతుంది. మామూలు ఉప్మా కంటే ఈ ఉప్మా కొద్దిగా జిగురుగా ఉంటుంది. జొన్న రవ్వతో ఇలా ఉప్మాను తయారు చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.
No comments:
Post a Comment