Adsense

Wednesday, April 5, 2023

నవాబీ సేమ్యా Nawabi semai Recipe

నవాబీ సేమ్యా
కావాల్సినవి :
కార్న్ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు
సన్న (పాల)సేమ్యా - రెండు, కప్పులు, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, చక్కెర, పాల పొడి - ఒక్కోటి ఒక కప్పు చొప్పున, పాలు - మూడు కప్పులు కస్టర్డ్ పౌడర్ - ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి - పావు టీస్పూన్ తయారీ :

సేమ్యాని చేత్తో నలపాలి. ఈ సేమ్యాను ఒక పాన్
లో నెయ్యి వేడి చేసి వేగించాలి. అందులో చక్కెర, పాల పొడి వేసి కలపాలి. మరో పాన్ లో పాలు పోసి,
చక్కెర, పాల పొడి, కార్న్ ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్ వేసి తర్వాత కోడిగుడ్డు సొన కూడా వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమం దగ్గర పడ్డాక యాలకుల పొడి వేయాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో రెడీ చేసిన సేమ్యా వేసి, పైన డ్రై ఫ్రూట్స్ పలుకులు చల్లాలి. పైన పాల మిశ్రమం పోయాలి. ఇలానే రెండు మూడు లేయర్లు వేసి మూడు గంటలు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత తింటే టేస్ట్ అదిరిపోతుంది.

No comments: