తీపి టొమాటో
కావాల్సినవి : టొమాటోలు - మూడు బెల్లం - అర కప్పు యాలకుల పొడి - అర టీస్పూన్, కార్న్ ఫ్లోర్ - ఐదు టేబుల్ స్పూన్లు, నెయ్యి - ఒక టేబుల్ స్పూన్ వేడి నీళ్లు - అర కప్పు తయారీ :
టొమాటోలను ముక్కలుగా తరిగి, మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వడకట్టి, రసం తీయాలి. ఒక పాన్లో టొమాటో రసం పోయాలి. అందులో బెల్లం వేసి కలపాలి. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి, వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని టొమాటో రసంలో పోసి గరిటెతో బాగా కలపాలి. మిశ్రమం దగ్గర పడ్డాక యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. ఒక గిన్నెకి నెయ్యి పూసి, ఈ మిశ్రమం పోసి మూత పెట్టాలి. చల్లారాక చాకుతో ముక్కలు చేస్తే టొమాటో స్వీట్ రెడీ.
No comments:
Post a Comment