Adsense

Sunday, May 14, 2023

హనుమత్కల్యాణం..!!

 హనుమత్కల్యాణం..!!



🌿రామాయణంలో హనుమంతుని
కల్యాణం విషయం లేదు కదా
సువర్చలా వృత్తాంతం ఎక్కడిది
అని కొందరు ప్రశ్నిస్తారు సమాధాన మేమిటంటే

🌸హనుమంతుని చరిత్ర అంతా రామాయణంలో లేదు
కథకు అవసరమైన మేరకే వాల్మీకి స్వీకరించాడు
అన్నీ యుగాలలోనూ చిరంజీవిగా ఉన్న
హనుమంతుని సంపూర్ణ చరిత్ర
కేవలం త్రేతాయుగానికి చెందిన
రామాయణంలో  ఉండే అవకాశం లేదు
అలాగే హనుమంతుడు  బ్రహ్మచార అంటారు
ఈ వివాహం ఎలా జరిగిందనేది మరో ధర్మసందేహం

🌷బ్రహ్మచర్యం నాలుగు రకాలు
గాయత్రం  బ్రహ్మం  ప్రజాపత్యం
బృహన్
🌷

🌿అని వాటికి పేర్లు
భార్యతో నియమపూర్వక జీవితం గడిపేవారిని  ప్రజాపత్య బ్రహ్మ -- చారులంటారు
బ్రహ్మచర్య నియమాలను సరిగా
అర్ధం చేసుకోగలగాలి
హనుమంతుడు భవిష్యద్ర్బహ్మ
ఆయన బ్రహ్మస్తానం పొందినవాడు
సువర్చలాదేవి సరస్వతి స్థానం పొందుతుంది

🌸దేవతల భార్యలంటే అర్ధం వారి శక్తులే  బ్రహ్మచర్య నిష్టాగరిష్టునికి ఉండే శక్తి వర్చస్సు సువర్చస్సు ఆమెయే సువర్చలా దేవి

   🌹🙏
కళ్యాణ వైభోగం🙏🌹

🌿సువర్చలాపతిష్షష్ఠః అన్నారు
హనుమంతునికి నవావతారాలు ఉన్నాయి వాటిలో ఆరోది సువర్చలాంజనేయ అవతారం

🌸సువర్చలా హనుమత్ ద్వాదశక్షరీ మంత్రం మంత్రశాస్త్రంలో ఉంది
ధ్వజదత్త, కపిలాది భక్తి ఉపాసకులకు సువర్చలాహనుమత్ సాక్షాత్కారం జరిగింది

🌿దేశం నలుమూలలా మాత్రమే కాకుండా విదేశాలలో కూడా సువర్చలాంజనేయ విగ్రహాలున్నాయి

🌸బందరు పరాసుపేటలో శివాజీగురువు సమర్ధ రామదాసుస్వామి
16వ శతాబ్దిలో ప్రతిష్ఠించినది సువర్చలాంజనేయ ఆలయమే  అనేక హనుమాదాలయాలలో
వైశాఖ, జ్యేష్ఠ, మాసాల్లో కల్యాణాలు నిర్వహించడం

🌸సువర్చలాంజనేయుల ఉత్సవమూర్తులను
సిద్ధంచేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది  హనుమ- దుపాసకులు ఎందరో హనుమత్కల్యాణం నిర్వహిస్తూ ఉంటారు

🌿మార్గశిర శుద్ధ త్రయోదశినాటి
హనుమద్ర్వత సమయంలో
సువర్చలాంజనేయ కలశాలను ఉంచి పూజిస్తారు  సువర్చలా హనుమత్ గాయత్రి మంత్రం జపించడంవల్ల వివాహంఅయిన వారెందరో ఉన్నారు,
గృహస్ధులైన వారికి సువర్చలాంజనేయ సేవ సకల శ్రేయేభివృద్ధులనూ కలిగిస్తుంది

🌸సూర్యుని భార్య సంజ్ఞాదేవి
ఆమె విశ్వకర్మ కుమార్తె  సూర్యతాపాన్ని భరించలేక తన ఛాయను సృష్టించి/సూర్యుని సేవలో ఉంచింది
తాను సముద్రగర్బంలో అశ్వరూపంలో
తపస్సు చేసుకుంటుంది

🌿ఒకరోజు కుమార్తెను చూడడానికి వచ్చాడు  సూర్యుని వద్ద ఉన్నది తన కుమార్తె కాదని గుర్తించి
సూర్యునికి ఆ సంగతి తెలియచేసాడు
అప్పుడు సంజ్ఞాదేవి సముద్రగర్బంలో
ఉండటం గ్రహించిన సూర్యుడు
అశ్వరూపంలోనే ఆమెను కలిశాడు
అప్పుడు పుట్టినవారే అశ్వినీదేవతలు

🌸సంజ్ఞాదేవి తన తేజస్సు భరించలేకుండా ఉన్నకారణంగా
మామగారైన దేవశీల్పి విశ్వకర్మను రావించాడు  లోహాన్ని ఒరిపిడి పెట్టినట్లు చేసి సూర్యతేజస్సును కొంత తగ్గించాడు  విశ్వకర్మ అలా ఒరిపిడి పెట్టిన‌తేజస్సు నుంచి
విష్ణువుకు చక్రము  శివునికి త్రిశూలం
మొదలైన ఆయుధాలను విశ్వకర్మ తయారుచేశాడు

🌿ఇంకా కొంత సూర్యుని వర్చస్సు మిగిలింది  దానికి బ్రహ్మదేవుడు ప్రాణప్రతిష్ఠ/చేశాడు
శక్తి స్త్రీ స్వరూపం కాబట్టి ఆడపిల్ల అయింది  ఆ సూర్యసర్చస్సుకు సువర్చస్సు -- సువర్చల
అని పేరు పెట్టాడు బ్రహ్మదేవుడు

🌸ఈ సుగుణవతి ఎవరికి భార్య అవుతుంది ? అని ఇంద్రాదులు ప్రశ్నించినప్పుడు
సూర్యుని ఫలమనే బ్రాంతితో పట్టబోయినవానికి
ఈమే భార్య‌ కాగలదని  సమాధానం చెప్పాడు

🌿ఆయనే హనుమంతుడని అందరికీ
తెలిసిన విషయమే
ఆంజనేయుడు సూర్యుని వద్ద‌
విద్యాభ్యాసం చేశాడు
ఏకసంథ్మాగ్రాహిగా వేదశాస్త్రాదులు  ఇంద్రవ్యాకరణంతో సహా
వ్యాకరణాలు నేర్చుకున్నాడు
ఆయనలోని అసాధారణ పజ్ఞకు
సూర్యుడు చాలా సంతోషించాడు

తస్య బుద్ధిం చ విద్యాం చ బల శౌర్య పరాక్రమాన్ !
విచార్య తస్మె ప్రదతౌ స్సస్య కన్యాం సువర్చలామ్ !!


🌸హనుమంతుని బుద్ధి
విద్య బలపరాక్రమములు
చూచి మెచ్చిన సూర్యభగవానుడు
తన కుమార్తె అయిన సువర్చలను
హనుమంతునకు ఇచ్చి వివాహం చేయదలిచాడు

🌿కానీ హనుమంతుడు బ్రహ్మచర్య వ్రతం  పాటించ దలచానని చెప్పాడు
నీ బ్రహ్మచర్య నిష్టకు భంగం కాని రీతిలో ఈమెను స్వీకరించు అంటూ సూర్యభగవానుడు జ్యేష్ఠ శుద్ద దశమినాడు సువర్చలా హనుమంతునకు కల్యాణం చేశాడు

🌿రామభక్తులకు రామాయణం
కృష్ణభక్తులకు భాగవతం ఎలా ప్రమాణమో హనుమద్బక్తులకు పరాశర‌ సంహిత అలా ప్రమాణం

🌸ఈ గ్రంథం చాలాకాలం వెలుగులోకి రానందువల్ల సమాజానికి పూర్తి హనుమచరిత్ర ఆలస్యంగ అందింది
శ్రీరామదూతం శిరసా నమామి..

No comments: