సువర్చలాంజనేయ ధ్యానం ....!!
శ్లో॥ సువర్చలాధిష్ఠిత వామభాగం-వీరాసనస్థం కపిబృంద సేవ్యం| స్వపాదమూలం శరణంగతానాం అభీష్టదం శ్రీహనుమంతమీళే
శ్లో॥ భక్తకల్పతరుం సౌమ్యం - లోకోత్తర గుణాకరం | సువర్చలాపతిం వందే - మారుతిం వరదం సదా”||
సువర్చలాదేవి ఎడమభాగంలోను, కపి సమూహ మంతా కుడివైపున కల్గియుండి తనను శరుణువేడిన వారి కోరికలన్నియు తీర్చెడి
శ్రీ హనుమంతుని స్తుతించుచున్నాను,
భక్తులపాలిటి కల్పవృక్షమగువాడు సౌమ్యరూపుడు, లోకోత్తరములైన గుణములకు నిలయమైనవాడు, వాయునందనుడు, కోరినవరము లిచ్చువాడు ఐన సువర్చలాంజనేయునకు నమస్కరించుచున్నాను.
అనేది పై ధ్యానముల భావం. ఈ అవతారస్వామి అనుగ్రహానికి నిదర్శనంగా ధ్వజదత్తుని చరిత్రలో తెలుస్తుంది..
No comments:
Post a Comment