Adsense

Tuesday, May 2, 2023

హనుమంతుడి అమ్మమ్మ అహల్య...!!

హనుమంతుడి అమ్మమ్మ అహల్య...!!


🌿గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చి శివుడు సాక్షాత్కరించిన తరువాత తను బ్రహ్మచర్యము వీడి తను ఇచ్చటనే ఉండి ఇంకనూ సంతానం పొందగోరి సంసార జీవితం గడిపారు.

🌸 అహల్య గౌతమ మహర్షి దంపతులకు ఒక కుమార్తె ఇద్దరు కుమారులు కలిగారు.కుమార్తె అంజనాదేవి కాగా, కుమారులు వాలీ, సుగ్రీవులు. ఆంజనేయస్వామికి వాలి సుగ్రీవులు మేనమామలు అవుతారు...

🌿అహల్య గౌతములు అన్యోన్యంగా ఉంటున్న సందర్భంలో, ఇంద్రుడు అహల్య అందచందాలను
చూసి ఆమెపై మోజుపడతాడు.

🌸 అహల్యను పొందడానికి ఇంద్రునికి సాధ్యం కాకపోవడంతో, ఇంద్రుడు తప్పుడు మార్గంలో అహల్యను పొందాలని యోచించి, ఒకనాడు గౌతమ మహర్షి లేని సమయాన గౌతమ మహర్షి రూపములో వచ్చి అహల్యతో ఇంద్రుడు తన కోరికను తీర్చుకున్నాడు.

🌿అహల్య ఈ విషయాన్ని గ్రహించలేదు, కానీ అంజనాదేవి మాత్రం, వచ్చిన వారు తన తండ్రి కాదని గ్రహించింది, కానీ జరిగిన విషయాన్ని తన తల్లి అహల్య కు గానీ, తండ్రికి గానీ చెప్పటానికి సాహసించలేదు,

🌸 తను గ్రహించిన తనలోనే దాచుకొని మౌనముగా ఉండిపోయింది. ఇదిలా వుండగా ఒకనాడు గౌతమ మహర్షి తన ఇరువురు కుమారులను రెండు భుజములపై ఎక్కించుకుని

🌿 కుమార్తెను చేత పట్టుకుని సరస్సు గట్టుపై నడుస్తున్న సమయాన చిరంజీవి అంజనా తన తండ్రి తనకు పుట్టిన నన్ను నడిపిస్తూ, పరులకు పుట్టిన వారిని భుజములపై మోయుచున్నాడని బాధపడుతుంది.

🌸కూతురి మనస్సులో జరుగుతున్న సంఘర్షణ గమనించిన మహర్షి దాని వెనుక ఉన్న కారణాన్ని మనోనేత్రమున గ్రహించగలిగాడు,

🌿స్పష్టత కోసం అంజనా దేవిని అడిగి , జరిగిన విషయం తెలుసుకుని తన కూతురు చెప్పిన విషయంలో నిజమెంతో పరీక్షించదలచి ఈ సరస్సులోని నీటిలో వీరిద్దరిని పడవేస్తాను,

🌸పరులకు పుట్టినవారైతే మర్కట రూపులుగా, తనకు పుట్టినవారైతే తమ స్వరూపులుగా ఈ నీటి నుండి తిరిగి వస్తారని చెప్పి పిల్లలిద్దరిని నీటిలో పడవేస్తాడు. పిల్లలిద్దరూ మర్కట రూపులై తిరిగి రావడం చూసి గౌతమ మహర్షి మిక్కిలి కోపిస్టులవుతారు.

🌿ఈ విషయం తెలిసిన అహల్య అచ్చటకు వచ్చినది. కోపిష్టుడైన మహర్షి అహల్యతో పరపురుషుని స్పర్శ, భర్త స్పర్శకి తేడా తెలియనంతగా బండరాతివై ఉన్నావా, నీవు రాతి బండవు కమ్మని అహల్యను శపించి పిల్లలను వదిలేసి మహర్షి కోపముతో అక్కడ నుండి వెళ్లిపోయాడు.

🌿అప్పుడు అహల్యాదేవి తన కుమార్తె అంజనాతో పరపురుషులు తన తండ్రి రూపముతో వచ్చినారని తెలిసి కూడా తనను హెచ్చరించక పోగా, జరిగిన పాపాన్ని తనకు వెంటనే చెప్పి ఉంటే ప్రాయశ్చిత్తము చేసుకునే దాన్ని,

🌸కానీ తప్పు జరిగిందని తెలిసి కూడా ఇంతకాలం చెప్పకుండా ఉండి, తను మహర్షి కోపానికి గురికావడమే కాకుండా, శాపగ్రస్తురాలగుటకు, తన కుమారులు మర్కట రూపులు అగుటకు కారణమైతివి.

🌿 కాబట్టి నీవు అంధురాలివికమ్ము అని తన కుమార్తె అంజనాదేవిని శపించినది. తల్లి శాపముతో అంధురాలిగా మారిన అంజనాదేవి ఆ ప్రాంతం వదిలి కిష్కింద చేరి అంధత్వంతో తిరుగుతూ ఉండగా,

🌸ఆ అడవిలో ఒకరోజు ఒక యోగి పూజ చేసుకుంటుంటే పూజాద్రవ్యాలను గుర్తించకుండా వెళ్లి తొక్కుతుంది, దానికి ఆగ్రహించిన యోగి, నీకు నేల మీద నడవడానికి అర్హతలేదు మర్కటం గా మారి, చెట్ల కొమ్మలపై వేలాడుతూ బ్రతుకు అని శపిస్తాడు,

🌿దానికి బాధపడిన అంజనా దేవి తన దుస్థితిని ఆ యోగికి తెలుపగా, ఆ యోగి తన తొందరపాటుకు చింతిస్తూ, తన వాక్కు తప్పదు కాబట్టి, నా పూజ ఫలం మొత్తం ధారపోసి నీకు దృష్టి తెప్పిస్తాను అని చెప్పి అంజనాదేవికి చూపు రప్పిస్తాడు,

🌸అలా అంజనాదేవికి దృష్టి వచ్చింది కానీ ఆమె రూపం మాత్రం యోగి వాక్కు వల్ల కోతిలా మారిపోయింది, అదే అడవిలో అత్యంత శక్తి సంపన్నుడైన, వానర నాయకుడు కేసరి అంజనాదేవిని చూసి ఇష్టపడగా,

🌿అంజనా కేసరి ల వివాహం జరిగినది. ఒకానొకరోజు ఈ వానర దంపతులు మానవ రూపాలను ధరించి తమ రాజ్యంలోనే విహరించసాగారు. సంతోషంగా విహరిస్తున్న సమయంలో వాయువు చాలా వేగంగా వీస్తుంది.

🌸అప్పుడు ఒక వాయువుతరంగం అంజనాదేవి చీర చెంగును ఎగరగొడుతుంది. దాంతో ఆమెను ఎవరో స్పృజించినట్లుగా అనిపిస్తుంది.

🌿 దానికి ఆమె కోపంతో నా పాతవ్రత్యాన్ని భంగం కలిగించడానికి సాహసించింది ఎవరు నేనిప్పుడే వారిని శపిస్తాను అని ఆగ్రహిస్తుంది. అందుకు సమాధానంగా వాయుదేవుడు దేవీ! నేను వాయుదేవుడిని.

🌸నా స్పర్శవల్ల నీ పాతివ్రత్యము భంగం కాలేదు. అయితే శక్తిలో నాతో సమానమైన ఒక సుపుత్రుడు నీకు కలుగుతాడు. నేను అతనిని అన్నివేళలా రక్షిస్తాను. అంతేకాదు బాలల నుంచి పెద్దలవరకు అందరూ అతనిని ఆధ్యాత్మికంగా ఆదరిస్తారు.

🌿 ఎవరు అతనిని తిరస్కరించేవారు వుండరు. అతడు భగవంతునికి సేవ చేసుకుంటూ ఆదర్శమార్గంలో సత్కీర్తిని పొందుతాడు అని చెబుతాడు.

🌸ఆ తరువాత కేసరీదంపతులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొన్ని రోజులకి వాయుదేవుడు చెప్పిన విధంగా శంకరుని అంశతో అంజనాదేవికి శ్రీమత్ వైశాఖ బహుళ దశమినాడు పరాక్రమవంతుడైన హనుమంతుడు అవతరించాడని పురాణం.
..స్వస్తీ.

No comments: