Adsense

Friday, May 12, 2023

దుర్గా దేవి

దుర్గా దేవి 


🌿పార్వతీదేవి మహిషాసురమర్దిని, అవతారం దాల్చి  దుర్గముడు
అనే రాక్షసుని సంహరించి
'దుర్గాదేవి'గా పేరు పొందింది .

🌸భక్తితో  దుర్గ  అనే నామాన్ని ఉఛ్ఛరించినంతమాత్రమునే సకల శుభములు సంప్రాప్తిస్తాయి.

🌿దుర్గా ఉపాసకులు శూలిని దుర్గా, వన దుర్గా, శాంతి దుర్గా, జాతవేదో దుర్గా, దీప దుర్గా, జ్వాలాదుర్గా,ఆసురీదుర్గా అని  వివిధ రూపాలతో, వివిధ మంత్రాలతో స్తుతించి, పూజిస్తారు.

🌸దుర్గాదేవిని ఆరాధించిన
వారికి,అప్పులబాధ,శోకం
పిశాచ భయం, పీడలు
వుండవని  చెప్తారు. 

🌿దుర్గా దేవి నామాన్ని భక్తితో  ఉఛ్ఛరించినంత మాత్రము చే మానవులు వంశవృధ్ధి,ధనవృధ్ధి కలిగి
భాగ్యశాలురై  సుభిక్షంగా వుంటారని ,

🌸రాక్షస, భూత,ప్రేత , పిశాచ గణాల పీడవుండదని , విష  సర్పాలు ,  దుష్టజంతువులు దూరంగా తొలగిపోతాయని , శతృభయం వుండదని‌ ,  రోగాలు , అనారోగ్యం దరి చేరవని దేవీ భాగవతంలో,
వ్యాస భగవానుడు చెప్పాడు.

🌿మంగళవారం, శుక్రవారములే కాకుండా
అనునిత్యం ఆ దుర్గాపరమేశ్వరిని ఆరాధిస్తే ఆవిడ కృప తప్పక లభిస్తుంది...స్వస్తీ
.

No comments: