Adsense

Wednesday, May 24, 2023

జయాయ జయభద్రాయ

జయాయ జయభద్రాయ
హర్యశ్వాయ నమో నమః ।
నమో నమః సహస్రాంశో
ఆదిత్యాయ నమో నమః ॥....

ఉపాసకులకు విజయమును,
ఉన్నతిని, క్షేమమును
మంగళమును ఇచ్చువాడు,
ఆకుపచ్చని గుఱ్ఱములు కలవాడు
అయిన సూర్యునకు
నమస్కారము. నమస్కారము.
వేయికిరణములు కలవాడా,
నమస్కారము. నమస్కారము.....

సూర్య ఇత్యక్షరద్వయమ్ !
ఆదిత్య ఇతి త్రీణ్యక్షరాణి !
ఏతస్వైవ సూర్యస్యాష్టాక్షరో మను: !

'ఓం' అనేది ఏకాక్షర బ్రహ్మము.
'ఘృణి' అనేది రెండు అక్షరాలు.
'ఆదిత్య' అనేది మూడు అక్షరాలు.

"ఓం ఘృణిః సూర్యః ఆదిత్యః"
అనేవి ఏకమైన సూర్యుని అష్టాక్షరీ మంత్రం.


యస్సదాహ రహ ర్జపతి స వై
బ్రాహ్మణో భవతి  స వై బ్రాహ్మణో భవతి !

ఈ మంత్రాన్ని ఎవరు సదా దినదినమూ
జపిస్తారో అతడే బ్రాహ్మణుడవుతాడు.

సూర్యాభిముఖో జప్త్వా,
మహావ్యాధి భయాత్ ప్రముచ్యతే !
అలక్ష్మీర్నశ్యతి !
అభక్ష్య భక్షణాత్ పూతో భవతి !
అగమ్యాగమనాత్ పూతో భవతి !
పతిత సంభాషణాత్ పూతో భవతి !
అసత్ సంభాషనాత్ పూతో భవతి !

సూర్యునికి అభిముఖంగా నిలచి
జపించడం వల్ల మహా వ్యాధి భయాన్నుండి
విడివడుతాడు.దారిద్ర్యం నశిస్తుంది.
తినకూడనిది తిన్న పాపం నుండి,
పతితులతో కలసి సంభాషించిన పాపం
నుండి, అసత్య భాషణ పాపం నుండి
విముక్తుడై పవిత్రుడౌతాడు....🙏🙏🙏

మధ్యాహ్నే సూర్యాభిముఖ: పఠేత్ !
సద్యోత్పన్నఞ్చ మహాపాతకాత్
ప్రముచ్యతే !

మధ్యాహ్నం సూర్యాభిముఖుడై ఉపనిషత్
ను పఠించాలి. ఉత్పన్నమైన పంచమహా
పాతకాలనుండి  వెంటనే విముక్తుడౌతాడు.

సైషా సావిత్రీం విద్యాం న
కించిదపి న కస్మైచిత్ప్రశంసయేత్ !

అదే సావిత్రీ విద్య.
కొంచం కూడా,
దేనికోసమూ ఎవరినీ పొగడడం కాని,
నిందించడం కాని చేయరాదు.

య ఏతాం మహాభాగ: ప్రాత: పఠతి,
స భాగ్యవాన్ జాయతే పశూన్విన్దతి !వేదార్థం లభతే !

ఏ అదృష్టవంతుడు ఉదయమే
దీనిని పఠిస్తాడో,
అతడు భాగ్యవంతుడౌటాడు.
పశు సంపద పొందుతాడు.
వేదార్థాలను పొందుతాడు.

త్రికాలమేతజ్జప్త్వా,
క్రతుశతఫలమవాప్నోతి !
హస్తాదిత్యే జపతి, స మహామృత్యుం
తరతి స మహామృత్యుం తరతి
య ఏవం వేద ! ఇత్యుపనిషత్ !!

దీనిని మూడు కాలాలలోనూ
జపించడం వల్ల నూరు యాగాల
ఫలాన్ని పొందుతాడు.
ఆదిత్యుడు హస్తలో
ఉండగా జపించినప్పుడు,
అతడు మహా మృత్యువును దాటుతాదు
ఇలా ఎవరు తెలుసు కొంటారో!
ఇదే ఉపనిషత్తు.

ఓం శాంతి: శాంతి: శాంతి:!!.

No comments: