Adsense

Wednesday, May 24, 2023

జ్యేష్ట మాసం బ్రహ్మదేవుని ప్రియ మాసం.

జ్యేష్ట మాసం
బ్రహ్మదేవుని ప్రియ మాసం.

త్రిమూర్తులలో సృష్టికర్తయైన
వైదేహీ పతికి అత్యంత ప్రీతికరమైన
ఈ జ్యేష్ట మాసంలో బ్రహ్మదేవున్ని ఆరాధిస్తూ ,
వేడి నుండి ఉపశమనం కలిగించే వస్తుసామగ్రిని ,
నీటితో నింపిన కుండను
శుక్ల పక్ష పాడ్యమి నుండి జ్యేష్ట పౌర్ణమి తిథి లోపు
సద్బ్రాహ్మణునుకి దానం చేసిన వారికి ,
సర్వ జీవరాశుల లలాటంపై
తాను లిఖించిన కష్టాలను తొలగించి ,
సుజ్ఞానాన్ని బ్రహ్మయే ప్రసాదిస్తాడు.
అంతేకాకుండా ..
జ్యేష్టమాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకుని
శుక్ల దశమి వరకు ఆ పదిరోజులు
శ్రద్ధతో నియమాలను పాటించడం వల్ల
దశ పాపాలు నాశనం అవుతాయని ,
ఈ పదిరోజులు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి
కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో
స్నానము చేసి , గంగానదిని పూజించాలనీ ,
అలా వీలు కాని యెడల స్వగృహం నందే
గంగను స్మరిస్తూ స్నానం చేసిన వారికి
త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని ,
ఈ జ్యేష్ఠ మాసంలో సకల పాపాలను తొలగించే
పుణ్య తిథులు , పర్వదినాలు ఉండటం వల్ల
సర్వ మానవాళికి పాప నివృత్తి చేసే
మాసమే ఈ జ్యేష్ఠ మాసమని , అంతే కాకుండా ..
ఈ మాసం మొదలుకొని చివరి తిథి వరకు
స్వచ్ఛమైన గోధుమపిండితో బ్రహ్మదేవుని రూపాన్ని
తయారు చేసుకొని ఆరాధించడం వల్ల
విశేషమైన శుభ ఫలితాలు తప్పక పొందవచ్చని
బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది.

No comments: