కావలసినవి: కాకరకాయలు ఒక కిలో ఎండు మిర్చి: 100 గ్రా‘‘; చింతపండు: 50 గ్రా‘‘; ధనియాలు: 50 గ్రా‘‘; వెల్లుల్లి: 50 గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; శనగపప్పు: మినప్పప్పు: ఒక్కొక్కటి ఒక స్పూను; ఉప్పు,నూనె: తగినంత
తయారి: దీనికి రెండు రోజులు పని చేయాలి. ముందు రోజు కాకరకాయలను చిన్న ముక్కలు చేసి ఎండబెట్టాలి. మరుసటి రోజు నూనెలో వేయించి పొడి చేయాలి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నింటినీ వేయించుకుని చింతపండు, వెల్లుల్లి వేసి పొడి చేయాలి. ఈ మిశ్రమంలో కాకరకాయ ముక్కల పొడిని కలుపుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడ.
No comments:
Post a Comment