Adsense

Monday, May 8, 2023

కరివేపాకు కారం

కరివేపాకు కారం

కావలసినవి: కరివేపాకు: పావుకిలో; ఎండు మిర్చి: 100గ్రా‘‘; చింతపండు: 50గ్రా‘‘; వెల్లుల్లి: 50గ్రా‘‘; జీలకర్ర: రెండు స్పూన్లు; ధనియాలు: 100గ్రా‘‘; పచ్చిశనగపప్పు: రెండు స్పూన్లు; మినప్పప్పు: రెండు స్పూన్లు; నూనె: వేయించడానికి కావలసినంత.

తయారి: కరివేపాకును కారం చేయడానికి ముందురోజు కడిగి ఆరబెట్టాలి. ఆరిన కరివేపాకును రెమ్మల నుండి విడదీసి సిద్ధంగా ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత కరివేపాకును వేయించాలి. దానిని పక్కన ఉంచి మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పప్పులు అన్నీ వేయించుకుని పొడి చేసేటప్పుడు చింతపండు, వెల్లుల్లిని చేర్చాలి. ఇది దోశలలోకి బాగుంటుంది. అన్నం లో కలుపుకోవచ్చు. ఏదైనా అనారోగ్యం నుంచి స్వస్థత పొందిన వాళ్లకు దీనితో భోజనం పెడితే నోటి అరుచి పోయి హితవు పుడుతుంది. త్వరగా జీర్ణం కావడంతోపాటు కరివేపాకులో ఉండే ఐరన్‌ శరీరానికి శక్తినిస్తుంది.

No comments: