Adsense

Sunday, May 28, 2023

లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం, ధనాభివృద్ధి కోసం "వైజయంతి మాల" ధారణ

లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం, ధనాభివృద్ధి కోసం "వైజయంతి మాల" ధారణ..............!! 

క్షీరాంభోరాశిసారైః ప్రభవతి రుచిరైర్యత్స్వరూపే ప్రదీపే
శేషాణ్యేషామృజీషాణ్య జనిషత సుధాకల్పదేవాంగనాద్యాః
యస్యాస్సింహాసనస్య ప్రవిలసతి సదా తోరణం వైజయంతీ
సేయం శ్రీవేంకటాద్రి ప్రభువరమహిషీ భాతు పద్మావతీ శ్రీః
జయ జయ జయ జగదీశ్వర కమలాపతి కరుణారస వరుణాలయవేలే, చరణాం బుజ శరణాగత కరుణారస వరుణాలయ మురబాధన కరబోధన సఫలీకృత శరణాగత జనతాగమవేలే, కించిదుదంచిత సుస్మిత భంజిత చంద్రకలామద సూచిత సంపద విమల విలోచన జిత కమలాసన సకృదవలోకన సజ్జన దుర్జన భేదవిలోపన లీలా లోలే, శోభనశీలే, శుభగుణమాలే, సుందరభాలే, కుటిల నిరంతర కుంతలమాలే, మణివర విరచిత మంజులమాలే, పద్మసురభి గంధ మార్దవ మకరంద ఫలితాకృతి బంధ పద్మినీ బాలే, అకుంఠ వైకుంఠ మహావిభూతి నాయికే, అఖిలాండకోటిబ్రహ్మాండనాయికే, శ్రీవేంకటనాయికే, శ్రీమతి పద్మావతి, జయ విజయీ భవ
వైజయంతి విత్తనాలు శ్రీ కృష్ణుని జన్మస్ధానమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర పట్టణానికి 15 కి.మీ దూరంలో ఉన్న బ్రాజ్ అరణ్య ప్రాంతంలో లబిస్తాయి. వైజయంతి విత్తనాలు రాధ కృష్ణుల ప్రేమకు ప్రతిరూపమని భావిస్తారు.
క్షీరసాగర మథనంలో క్షీరసముద్రంలో లక్ష్మీదేవి మొదలైన ఎన్నో వస్తువులు పుట్టడం మహాలక్ష్మి పుట్టినవెంటనే ఆమెకు మంగళస్నానము చేయిస్తారు.
❤ "కట్టంగ పచ్చని పట్టుపుట్టము దోయి ముదితకుఁ దెచ్చి సముద్రుఁడిచ్చె
మత్తాళినికరంబు మధు వాన మూఁగిన వైజయంతీమాల వరుణుఁడిచ్చెఁ" ❤
లక్ష్మీదేవికి సముద్రుడు పట్టు బట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు.
వైజయంతి మాలను దీపావళి రోజు గాని,శుక్రవారం రోజుగాని లక్ష్మీదేవి పటానికి గాని,శ్రీచక్రమేరువుకి గాని అలంకరించి లక్ష్మీ సహస్త్రనామంతో కుంకుమార్చన చేసి వైజయంతీ మాలను మెడకు దరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వైజయంతీ మాల ఉన్న ఇంట్లో అన్నీ శుభాలే ఉంటాయట.
1. వైజయంతిమాలను దరించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనాభివృద్ధి కలుగుతుంది.
2. వైజయంతి మాల పూసలను చిన్నపిల్లలకు చెవిపోగు,లాకెట్ లాగా చేపించి వేసిన బాలారిష్ట దోషాలు,నరదృష్టి,చొంగకార్చటం తగ్గుతుంది.
3. వైజయంతిమాలను వివాహం కానివారు ఈ మాలను ధరించి రుక్మిణీ కళ్యాణం చేపించుకొన్న వివాహ సంబంద ఆటంకాలు తొలగిపోతాయి.
4. దంపతుల మద్య తరచూ గొడవలు ఉన్న వారు వైజయంతిమాలను ధరించటం వలన వారి మద్య ఉన్న అపోహలు,గొడవలు తొలగిపోతాయి.
5. జాతకచక్రంలో శుక్రగ్రహ దోషాలు,సప్తమభావ దోషాలు ఉన్నవారు వైజయంతిమాలను ధరించటం మంచిది.
6. వైజయంతిమాలను వ్యాపార సంస్ధలలోని పూజ మందిరంలో దేవుడి పటాలకు,విగ్రహాలకు అలంకరించిన వ్యాపారాభివృద్ధితో పాటు ధనాభివృద్ధి కలుగుతుంది.
7. వైజయంతిమాలను ధరించినవారికి సమగ్రమైన ఆలోచనా విదానంతో ప్రతి పనిని అంచనా వెయ్య గలిగే సామర్ద్యం కలిగివుంటారు
8. వైజయంతి మాల ప్రేమ స్వరూపమైనది ప్రేమ ఫలిస్తుంది, శత్రువులు మిత్రులవుతారు. సమస్యలను దూరం చేస్తుంది
❤ అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అబిషేకం , ఏ నైవేద్యం పెట్టాలి. ❤
పాడ్యమి రోజు - ఆవు నేయి తో అభిషేకం చేస్తే సకల రోగలు నివారణ అవుతాయి.
విదియ రోజు - చక్కర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది.
తదియ రోజు - ఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి ,
చవితి రోజున - పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి.
పంచమి రోజు - అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు , బుద్ది శక్తి పెరుగుతుంది.
షష్టి రోజున - తేనే తో అమ్మవారిని అభిషేకించి , బ్రహ్మనునికి దానం ఇవటం వలన కాంతి పెరుగుతుంది, యషస్సు పెరుగుతుంది.
అష్టమి రోజున - బెల్లం నీటి తో అభిషేకించి, మంచి బెల్లం ఎవరికయినా దానం ఇవటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అనీ తీరిపొతయి అంటారు.
నవమి రోజున -
నైవేద్యం పెట్టడం వలన సకల సౌభాగ్యలు కలుగుతాయి.
దశమి రోజున - నల్ల నువ్వులు తో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దీర్గాయుషు పెరుగుతుంది.
వారాలలో ఏ నైవేద్యం....
ఆదివారం రోజు - పాలు
సోమవారం - పాయసం
మంగళవారం - అరటిపళ్ళు
బుధవారం - వెన్న
గురువారం - పటికబెల్లం
శుక్రవారం - తీపి పదార్ధాలు
శనివారం - ఆవు నేయి
అమ్మవారికి ఇష్టమయిన అన్నం
పులగం - అన్నం + పెసరపప్పు
పాయసన్నం
పెరుగు అన్నం
బెల్లం అన్నం
నైవేద్యం పెట్టకుండా మనం తింటే అది దొంగతనం చేసి తినట్టు , అందుకని దేవునికి నివేదన చేయకుండా తినకూడదు.
❤ నమస్తే సర్వలోకానాం జననీమజ్జసంభవామ్
శ్రియమున్నిద్ర పద్మాక్షిం విష్ణువక్షః స్థితామ్ ❤
లక్ష్మిదేవి క్షీర సముద్రం నుండీ ఉద్భవించినప్పుడు దేవతలందరూ ఆమెను ఈ శ్లోకంతో స్తుతించారు. వారి స్తుతులకు ప్రసన్నురాలైన లక్ష్మీదేవి, వారిని వరం కోరుకోమనగా, అప్పుడు దేవతలు ఈ స్తోత్రం పఠించినవారిని విడువవద్దని ఇంద్రుడు కోరాడు. ఆమె ఆ వరాన్ని అనుగ్రహించింది. ఈ శ్లోకాన్ని పఠిస్తూన్నవారింట లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్న నమ్మకం ఉంది.
అష్టైశ్వర్యాభివృధిరస్థు

No comments: