చిక్కుడుగింజల కూర
కావలసినవి:
2. తాజా చిక్కుడుగింజలు – కప్పు
3. ఉల్లితరుగు - పావు కప్పు;
4. పసుపు – చిటికెడు
5. పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు
6. పల్లీలు - కొద్దిగా;
7. ధనియాలు - టీ స్పూను
8. ఎండుకొబ్బరి - చిన్నముక్క;
9. వెల్లుల్లి రేకలు – 3
10. ఉప్పు - తగినంత;
11. ఆవాలు - అర టీ స్పూను
12. మినప్పప్పు - అర టీ స్పూను
13. ఎండుమిర్చి ముక్కలు - టీ స్పూను
14. కొత్తిమీర - చిన్న కట్ట;
15. నూనె - 2 టీ స్పూన్లు
16. కరివేపాకు - రెండు రెమ్మలు
తయారీ:
1. చిక్కుడుగింజలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు కలిపి కుకర్లో ఉడికించాలి.
2. పల్లీలు, ధనియాలు వేయించి చల్లారాక, ఎండుకొబ్బరి, వెల్లుల్లిరేకలు జత చేసి మిక్సీలో వేసి పొడి చేయాలి.
3. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి రెండు నిముషాలు వేయించాలి.
4. కరివేపాకు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, టొమాటో ముక్కలు జతచేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.
5. చిక్కుడుగింజలు, పసుపు, కారం వేసి బాగా కలిపి, గ్రైండ్ చేసి ఉంచుకున్న పొడి జల్లి మూత పెట్టి రెండు మూడు నిముషాలు ఉంచి, దించే ముందర కొత్తిమీర చల్లాలి.
No comments:
Post a Comment