Adsense

Monday, May 15, 2023

షోడశ బహు అష్ట ముఖ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం, కోట్ల నర్సింహలు పల్లె గ్రామం , గంగాధర్ మండలం , కరీంనగర్ జిల్లా

షోడశ బహు అష్ట ముఖ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం,కోట్ల నర్సింహలు పల్లె గ్రామం ,గంగాధర్ మండలం ,కరీంనగర్ జిల్లా

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నర్సింహులు పల్లె గ్రామం లో వెలసిన షోడశ బహు అష్ట ముఖ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం ఎంతో ప్రసాస్థ్యమైన క్షేత్రం.13వ శతాబ్దపు కాకతీయుల కాలం నాటి సోమనాథ,వీరభద్ర స్వామి దేవాలయాలు కొలువైనాయి.
అంతకు పూర్వము 8 వ శతాబ్దపు
ప్రసన్న లక్ష్మీ నరసింహ స్వామి,విశ్వనాథ దేవాలయలు కొలువైనాయి.ఆలయానికి సమీపం లో సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు కొలువై ఉంది.అందువలనే ఇ క్షేత్రాన్ని హరి హర క్షేత్రం అని పిలుస్తారు.

ఇంకా ఇ ఆలయం లో చతురబహు అన్నపూర్ణ అమ్మవారు,విజయ గణపతి,నందికేశ్వర విగ్రహాలు కొలువై ప్రతి నిత్యం  విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. ఆలయానికి క్షేత్ర పాలకుడిగా ప్రసన్న ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు.నరసింహ క్షేత్రము రాష్ట్ర కుటుల కాలం నాటిది గా శాసనాల ద్వారా తెలుస్తుంది.

ప్రధాన మందిరానికి ఎదురుగా వాయువ్య దిశలో వామనాంకిత సీతారామ స్వామి,లక్ష్మణ స్వామి దర్శనమిస్తారు.

ఒక రాయి పైన చెక్కబడిన విగ్రహం మనకు దర్శనం ఇస్తుంది.వైఖనస ఆగమల ప్రకారం 16 చేతుల లో  ఉండవలసిన ఆయధాలు చెక్కబడ్డాయి.

అది శంకరుల వారు స్వామి వారిని దర్శించుకున్నట్లు ప్రతీతి.ప్రతి నెల పౌర్ణమి తిథి  అర్ధరాత్రి నాడు నాగ దేవత స్వామి  వారిని దర్శించుకుంటుంది ఆట.శని గ్రహ,కుజ దోష నివారణకు,వివాహాల కోసం,సంతానం కొరకు విశేషమైన పూజలు నిర్వహించబడును.

ఇ క్షేత్రం లో పంచారాత్ర అగమల ప్రకారం సేవలు నిర్వహించబడుతాయి. నరసింహ స్వామి వారికి స్వాతి నక్షత్రం నాడు..పునర్వసు నక్షత్రము రోజు రాముల వారికి తిరుమంజన సేవలు నిర్వహిస్తారు.

చైత్ర పౌర్ణమి నుండి 3 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం.

No comments: