Adsense

Saturday, May 27, 2023

శ్రీశ్రీశ్రీ నీలమ్మ వేపచెట్టు అమ్మవారు- అస్సాం గార్డెన్స్,విశాఖపట్నం, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్

శ్రీశ్రీశ్రీ నీలమ్మ వేపచెట్టు అమ్మవారు- అస్సాం గార్డెన్స్,విశాఖపట్నం, విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్.

ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారి ని మనం కొలవడం ద్వారా.మనం ప్రకృతి లో ఎటువంటి దుష్పరిణామాలు రాకుండా కాపాడమని అమ్మ ని కొలుస్తాము. ఇప్పుడు మనం తెలుసుకోబోయే అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు. అమ్మవారిని వేపచెట్టు లోనే కొలుస్తారు.  ఈ ఆలయం లో అమ్మవారి ని వేపచెట్టు లో కొలుస్తారు.

నీలమ్మ వేపచెట్టు అమ్మవారి ఆలయం విశాఖపట్నం లోని అస్సాం గార్డెన్స్ లో ఉంది. ఇక్కడ నీలమ్మ అమ్మవారు ఏ విధంగా వెలిశారు అనే చారిత్రక వివరాలు పూర్తిగా ఎవరికీ తెలియవు. ఇక్కడ మాత్రం వేపచెట్టు కింద ఒక శిలా రూపం ఉంటుంది. ఆ శిలా రూపాన్ని ఆ వేపచెట్టు ని ఇక్కడ అమ్మవారి గా కొలుస్తారు. ఇక్కడ నీలమ్మ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి గా భక్తుల పాలిట కొంగబంగారమై కొలువుదీరి పూజలు అందుకుంటూ ఉన్నారు. అమ్మవారి ఆలయానికి ఆదాయం ఎక్కువగా రావడం తో అమ్మవారి ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ లో చేర్చారు.

విశాఖ జిల్లా వాసులు కనక మహాలక్ష్మి అమ్మవార్ని,కరక చెట్టు పోలమ్మ అమ్మవార్ని,కుంచమాంబ అమ్మవార్ని,అడివివరం పైడితల్లి అమ్మవారి తో పాటు శ్రీ నీలమ్మ వేపచెట్టు అమ్మవార్ని కూడా గ్రామ దేవత గా కొలుస్తున్నారు.

ఇక్కడ అమ్మవారు సంతాన ప్రదాయిని గా, స్త్రీలకు సౌభాగ్య ప్రదాయిని గా, వివాహం కాని వారికి కల్పవల్లి గా భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి గా పూజలు అందుకుంటున్నారు.

No comments: