శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించిన సిరిసంపదలు ప్రాప్తిస్తాయి. శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని పూజించి, లక్ష్మీ స్తోత్రాన్ని పఠించిన ఇంటిలో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారిని నిష్టతో పూజించినవారి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సంపదలు కొలువుదీరతాయి. శుక్రవారం రోజున పొరపాటున చేయకూడని పనులు ఉన్నాయి.
శుక్రవారం లక్ష్మి దేవి ఇంటికి వచ్చే రోజు. అమ్మవారిని ఈ రోజున అస్సలు బయటకు తీయకూడదు. ఇంట్లో ఏదైనా పాత లేదా విరిగిన అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నాడు అస్సలు నిమజ్జనం చేయకూడదు. ఎందుకంటే.. విగ్రహ నిమజ్జనం చేయడం అంటే దేవతకు వీడ్కోలు పలుకడమే. అందుకే శుక్రవారం రోజున ఇంట్లో నుంచి పాత విగ్రహాన్ని బయటకు తీయకండి. వీలైతే శుక్రవారం నాడు ఇంట్లోకి కొత్త విగ్రహాన్ని తీసుకురావాలి. అలాగే ఇంట్లోని మరే ఇతర దేవతా విగ్రహాన్ని తీయవద్దు. అలా చేస్తే లక్ష్మీ దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.
శుక్రవారం నాడు ఎవరికీ కూడా లక్ష్మిదేవి విగ్రహాన్ని ఇవ్వకూడదు. అలా చేస్తే స్వయంకృతాపరాధం చేసినట్లే అవుతుంది. శుక్రవారం నాడు మీ ఇంటికి లక్ష్మీ దేవి విగ్రహాన్ని తీసుకురావచ్చు, కానీ ఇతరులకు ఎవరికీ ఇవ్వకూడదు.
No comments:
Post a Comment