శుభోదయమ్
సుభాషితమ్. శ్లోకం
కంఠే యస్య లసత్కరాల గరళం గంగాజలం మస్తకే!
వామాంగే గిరిరాజ రాజతనయా జాయా భవానీ సతీ!
నంది స్కంద గణాధిరాజసహితా శ్రీవిశ్వనాథప్రభుః!
కాశీమందిరసంస్థితో ఖిలగురుర్దేయాత్సదా మంగళం!!
_- *!!తాత్పర్యము!!*-_
*ఎవని గళమునందు గరళము ప్రకాశిస్తున్నదో, ఎవని జటాజూటములో గంగ అలరారుతున్నదో*,
ఎవరి వామాంకమందు పర్వతరాజతనయయైన *పార్వతి సంసేవితయైయున్నదో ఆ తల్లి భవానీ, ఆ అమ్మ సతీదేవీ, తన పరివారమైన నంది, స్కంద, గణపతి, అమ్మ భవానీతో కూడి కాశీమందిరము నందు సంస్థితుడైన అఖిల గురువైన ఆ శ్రీవిశ్వనాథప్రభువు మనలకు సదా మంగళములు ఇచ్చు గాక!!
No comments:
Post a Comment