Adsense

Sunday, May 21, 2023

రాముడు స్మిత పూర్వభాషి.

రాముడు స్మిత పూర్వభాషి. అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడటం చిరునవ్వుతో ప్రారంభిస్తాడు. నవ్వు మనుషులను, మనసులను దగ్గర చేస్తుంది. కాగల కార్యం నెరవేరుస్తుంది. ఇప్పటి వ్యక్తిత్వ వికాస తరగతుల్లో చెప్పేదిదే.

వాల్మీకి రాముడి గుణ వర్ణన చేస్తూ ‘పిత శుశ షణే రత:’ అంటాడు. అంటే పిత సేవ అనేది రాముని సహజ లక్షణం. తండ్రి మాట వేదం. జవదాటడు. అనుభవంతో తలపండిన తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి మాటలను శిరసావహిస్తే, అవే అందరకూ ఆశీర్వచనాలు. వాటి విలువ తెలిస్తే ఈ రోజున పెద్దవాళ్లు వృద్ధ శరణాలయాల్లో ఉండరు. పిల్లల అభ్యున్నతిని కాంక్షిస్తూ వారి అభివృద్ధిని చూస్తూ పొంగిపోతూ, వాళ్ల మధ్యనే ఉంటారు.

రాముడిలోని మరో లక్షణం స్థిర చిత్తం. తన తండ్రి మాట నెరవేర్చడంలోనూ, ‘రాజ్య పాలనకు అంగీకరించాల’న్న భరతుని అభ్యర్థనను తిరస్కరించడంలోనూ, సీతా పరిత్యాగంలోనూ, ఏకపత్నీ వ్రతంలోనూ, సుగ్రీవునికి మాట ఇచ్చి వాలిని హతమార్చడంలోనూ, రావణుడిని యుద్ధంలో సంహరించి సీతను తిరిగి తెచ్చుకోవడం అనే సందర్భాల్లో రాముని స్థిర చిత్తం స్పష్టంగా గోచరమవుతుంది

హనుమంతుడు రాముని గుణగణాలను సీతకు వర్ణించి చెబుతూ ‘తన నడవడికను తనే సమీక్షించుకునే వాడు’ అంటాడు. లోటుపాట్లను చక్కదిద్దుకుంటాడట.

No comments: