ఆనంద తాండవం
హాలాహలేశ్వరుని దేవాలయం...!!
🌿 ఋషులు , యోగులు , సిధ్ధులు తపస్సు చేసే స్ధలాలలో ఆధ్యాత్మిక శక్తుల ప్రభావం చాలా
ఎక్కువగా వుంటుంది.
🌸వారి తపోబలం వలన
ఆ స్ధలం మహిమాన్వితమై
వుంటుంది. అటువంటి
మహిమాన్వితమైన ఆలయమే ఆలంపూండి లో వున్న హాలాహలేశ్వరుని ఆలయం చాలా పురాణప్రసిద్ధి చెందినది.
🌿దేవ దానవులు కలసి అమృతం కోసమై పాల కడలిని చిలుకుతుండగా ముందుగా హాలాహలం బయటపడింది.
🌸హాలాహలం యొక్క ఉష్ణ తీవ్రత దేవతలను, దానవులను చాలా బాధపెట్టింది.వారందరూ పరమశివుని
అనుగ్రహించమని వేడుకున్నారు.
🌿వారి బాధలు తీర్చడానికై పరమశివుడు
హాలాహలాన్ని వుండగా చేసి మ్రింగివేశాడు.
🌸పార్వతీ దేవి తన పతి కంఠానికి చేయి
అడ్డు పెట్టి విషం కంఠం దిగువకు రాకుండా మధ్యలోనే నిలిపివేసింది.
🌿 ఆ కారణంగా ఈశ్వరుని కంఠం నీలంగా మారి ఆయన నీలకంఠుడైనాడు.
🌸ముల్లోకాల జీవరాశుల
రక్షణ కై హాలాహలం సేవించిన పరమశివుని కి ఏ ఆపద వస్తుందోనని భయాందోళనలతో దేవగణమంతా కైలాసమునకు వెళ్ళారు.
🌿తనకు హలాహలం వలన
ఎటువంటి బాధా కలుగ
లేదని తెలియ చేయడానికి, పరమేశ్వరుడు నందీశ్వరుని
కొమ్ముల మధ్య ఆనంద
తాండవం చేశాడు.
🌸పరమేశ్వరుని ఆ ఆనంద తాండవంలో సకల లోకాలు తన్మయత్వంతో
మైమరచి పోయాయి.
ఈ కాలమే ప్రదోష పుణ్యకాలంగా చెప్పబడింది.
🌿కైలాసంలో చేసిన ఆనంద తాండవమును
చూసే భాగ్యమును తమకు మరల కల్పించమని దేవతలు, ఋషులు
కోరగా, పరమశివుడు
ఆనంద తాండవమాడి చూపించిన స్ధలమే ఆలంపూండి క్షేత్రం.
🌸హాలహలం సేవించిన ఈశ్వరుడు ఇక్కడ వెలసినందున 'హాలాహలేశ్వరుడు' అని ఆ వూరికి ఆలంపూండి అనే పేరు వచ్చింది.
🌿 వేయి సంవత్సరాల చరిత్ర కలిగిన యీ ప్రాచీన దేవాలయం చోళరాజుల కాలంలో పునరుధ్ధరించబడింది.
🌸గర్భగుడి లో ఆది హాలాహలేశ్వరుడు దర్శనం ప్రసాదిస్తుండగా ,
బయట ప్రాంగణంలో నీలకంఠేశ్వరుడు, మంగళాంబిక, దక్షిణా మూర్తి ,
🌿 దుర్గాదేవి, వినాయకుడు, బాలసుబ్రహ్మణ్యస్వామి,
నాయనమార్లు, లింగోద్భవుడు, శ్రీ మహావిష్ణువు,మహాలక్ష్మీ,
గజ లక్ష్మీ, బ్రహ్మ, ఆంజనేయస్వామి, కాలభైరవుడు, నవగ్రహాల విగ్రహాలు కూడా వున్నాయి.
🌸శివుడు ఆనందతాండవం
చేసినప్పుడు సమీపంలోని కొండ మీద కూడా ఆయన పాద ముద్రలు పడినవని ఐహీకం.
🌿 కొండ శిఖరాన వున్న యీ పాద ముద్రలకు ప్రతి సంవత్సరం అక్కడ వున్న కొండజాతివారు పూజలు చేసి ఉత్సవాలు జరుపుతారు.
🌸కార్తీక దీపం నాడు ,
దీపం వెలిగించి ఉత్సవం
జరుపుతారు.
🌿ఇక్కడ వున్న అమృత
పుష్కరిణిలోని తీర్ధం సకల వ్యాధులను నివారిస్తుంది.
🌸భక్తులంతా విధిగా ప్రదోష పూజలను భక్తి శ్రధ్ధలతో నిర్వర్తిస్తారు. ఇందువలన
సకల దోషాలు తొలగి , సంతాన భాగ్యం కలిగి, సుఖసంతోషాలు
లభిస్తాయని భక్తుల ధృఢ
విశ్వాసం.
🌿 తమిళనాడు లోని విల్లుపురం నుండి 40 కి.మీ. దూరంలోనూ , సెంజి నుండి తొమ్మిది కి.మీ. దూరంలోను యీ ఆలంపూండి హాలాహలేశ్వరుని దేవాలయం వున్నది...స్వస్తి...
No comments:
Post a Comment