రూపాలు వేరయినా స్థూలంగా అన్నీ ఒకేశక్తికి చెందినవే. ఒక్కొక్క స్థలంలో ఒక భక్తుడినో
భక్తురాలనో ఒక ఊరినో అక్కడున్న
దీనజనోద్ధరణకోసమో ఏదోరూపంలో
అవతరించడం జరుగుతుంది.
🔷గ్రామదేవతల స్వరూపాలు అటువంటివే. 18 వ
శతాబ్దంలో విజయనగరంలో వెలసిన పైడితల్లిగా
వ్యవహరించబడుతున్న పైడిమాంబ_అమ్మవారు కూడా అటువంటి శక్తి_స్వరూపమే.
🔷ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన
ఆనాటి విజయనగరరాజ్యంలో 'గజపతి' వంశంలో పరిపాలించిన విజయరామరాజు సోదరిగా దైవాంశతో జన్మించిన పైడిమాంబ జీవితాంతం అవివాహితగా ఉండి దైవారాధనలో దైవచింతనలోనే జీవితాన్ని గడిపిందని చెబుతారు. ఆరోజుల్లో బొబ్బిలి సామ్రాజ్యంతో విజయనగరానికి విపరీతమైన వైరం ఉండేదిట. కానీ పైడిమాంబ మాత్రం తమ సోదరుడయిన మహారాజుకు ఈ వైరం మానుకోమనీ యుద్ధం వలన తీరని ముప్పు కలుగుతుందనీ హితవు చెబుతూనే ఉండేదట. కానీ చిరకాల రాజకీయవైరాలు వీరత్వాలు పౌరుషాలతో నడచిన ఆ కాలంలో ఆ వైరాలు, దాడులు కొనసాగుతూనే ఉండేవి.
🔷ఎంత ప్రయత్నించినా బొబ్బిలి రాజులు విజయనగరాన్ని జయించలేకపోవడంతో వారు
ఫ్రెంచి పాలకులకు చెందిన ఆర్మీ చీఫ్ జెనరల్
బుస్సీ సహాయంతో 1757 లో బొబ్బిలిరాజు
విజయనగరరాజ్యంపై దండెత్తి ఆరాజ్య సైనికులను
వీరులను ఎంతోమందిని వధించారట. ఆ యుద్ధంలో
బొబ్బిలి సామ్రాజ్యానికి చెందిన ఆనాటి మహావీరుడిగా చరిత్రకెక్కిన తాండ్రపాపారాయుడు విజయరామరాజును సంహరించాడట. ఆ రాజ్యానికి దుర్దినాలు ప్రారంభమై 'మశూచి' వ్యాధి కూడా ప్రబలనారంభించిందట.
🔷రాజ్యపతనం, సోదరుడి మరణంతో వైరాగ్యం చెందిన పైడిమాంబ తనువును విడుస్తూ ఆ రాజకుటుంబానికి సన్నిహితుడయిన పాటివాడ అప్పలనాయుడు అనే ఒక వీరుడికి స్వప్నదర్శనంఇచ్చి తాను మరణించి 'దుర్గ అమ్మవారిలో' ఐక్యం అవుతున్నానని ఊరిలో ప్రఖ్యాతిగాంచిన పెద్దచెరువు పడమరభాగంలో అమ్మవారిగా తన విగ్రహం దొరుకుతుంది, దానిని వెలికితీసి ఆలయం నిర్మించమని ఆ ప్రాంతప్రజలను దర్శనం చేసుకొనే భక్తులను అనుగ్రహిస్తానని చెప్పిందట. అప్పటినుండి ఆ దేవాలయంలో విగ్రహరూపములో భక్తులను
అనుగ్రహిస్తూ ప్రఖ్యాతి గాంచింది.
🔷ప్రతీ యేట అక్టోబరు నెలప్రాంతంలో వైభవంగా
జరిగే సిరిమాను ఉత్సవంకు కొన్ని లక్షలమంది
భక్తులు తరలివస్తారు. ఈ ఉత్సవం గురించి ఒక
విచిత్రకధనం ప్రచారంలో ఉంది.
🔷ఆలయానికి అనాదిగా వంశపారంపర్యంగా కొనసాగుతున్న పూజారిగారికి ఉత్సవానికి సరిగ్గా 15 రోజుల ముందు కలలో అమ్మవారు కనిపించి ఒక నిర్దేశిత స్థలాన్ని సూచించి అక్కడున్న సిరిమాను వృక్షంనుండి భాగాన్ని తీసుకొచ్చి తగినవిధంగా చెక్కించి పూజించి ఊరేగించమని ఆదేశిస్తారట.
తెల్లటి ఏనుగు ఐదుగురు స్త్రీలతో అత్యంత
వైభవంగా పల్లకిలో ఆ సిరిమాను భాగం విజయనగరంకోట దేవస్థానం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేస్తుందని చెబుతారు.
🔷ఆ రాజవంశీయులు ఈనాటికి గూడా ఆ ఉత్సవంలో పాల్గొని పూజారికి నూతన వస్త్రాలను బహూకరిస్తారు. ఈ సంప్రదాయాలన్నీ నిర్విఘ్నంగా నిరంతరాయంగా రెండున్నర శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉండటం విశేషం.
🔷నమ్మి కొలిచే భక్తులందరికీ అభయమిచ్చి కొంగు బంగారంగా విలసిల్లుతున్న అమ్మవారి స్వరూపమే 'పైడితల్లి అమ్మవారు'.
సేకరణ:-
#శుభమస్తు
No comments:
Post a Comment