Adsense

Wednesday, May 24, 2023

హిందూ సంప్రదాయం ప్రకారం తులసి చెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది

తులసిదేహం ఆధ్యాత్మికమైంది. వృక్షరూపంలో ఉన్నా, ఆమె ఒకవ్యక్తి. ఎక్కడ కృష్ణునిపట్ల భక్తి కనిపిస్తుందో, అక్కడికి ఆమె వస్తుంది. ప్రతిరోజు ప్రొద్దున్నే భక్తులు తులసికి జలదానం చేయాలి. తులసిని ప్రార్థించి, ఆమెకు నాల్గు ప్రదక్షిణలు చేయాలి. పుష్పం, ధూపం, (లేదా అగరుబత్తి) నేతిదీపం, రుచికల నైవేద్యం, పూజావస్తువుల ద్వారా తులసిని ఆరాధించాలి.

“ఏకాదశి మరియు ద్వాదశియందు జాగరణ చేసి తులసీస్తోత్రం పఠించి, తులసీదళంతో సాలగ్రామశిలను పూజించినవారి 32 రకాలైన అపరాధాలను శ్రీహరి క్షమిస్తాడు.”

హిందూ సంప్రదాయం ప్రకారం తులసి చెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. తులసి చెట్టును ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి,గుమ్మం ఎదురుగా ఉంచుకొని ప్రతిరోజూ పూజిస్తూంటారు. రుతుక్రమణ సమయంలో ఆడవారెవరు తులసి దరిదాపులకు వెళ్ళకూడదని, అలా వెళ్లడం వల్ల, లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజించే తులసి చెట్టు అపవిత్రంగా మారడంతో మన ఇంట్లో ఉన్న సుఖ సంతోషాలు సమిసిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

No comments: