జపాలి తీర్థం, తిరుమల...!!
🌷హనుమంతుడు ఎక్కడ పుట్టాడో , పెరిగాడో తెలుసా ?🌷
🌿హనుమంతుడు పుట్టి పెరిగిన ప్రదేశం మన తిరుమల శేషాచల కొండలలో అంజనాద్రి పైన కొలువైన జపాలీ తీర్థం.
🌷జపాలి ఆంజనేయస్వామి🌷
🌸తిరుమల లో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలలో జాపాలి తీర్థం ఒకటి.ఇక్కడ వెలసిన హనుమంతుడు కి చాలా పురాణ ప్రాముఖ్యత కల్గిన చరిత్ర ఉంది.
🌿ఈ ప్రదేశం లో ఎందరో మహాత్ములు, యోగులు, సాధువులు సిద్ధి పొంది తరించారు. దేవతలు నడయాడిన ప్రదేశం ఈ జాపాలి.
🌸సాక్షాత్తు హనుమంతుడి కోసం తల్లి అంజనాదేవి తప్పస్సు చేసిన పవిత్ర ప్రదేశం.
🌿కేవలం దర్శన మాత్రముచే పంచమహా పాతకములు, భూత,ప్రేత పిశాచాది బాధలు నుండి విముక్తులవుతారని స్కాందపురాణం లోని వేంకటాచలమహత్యంలో తెలుపబడినది.
🌷జాపాలి తీర్థం :🌷
🌸దట్టమైన అటవీ ప్రాంతంలో, ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కటి జలపాతాల తో,దివ్య తీర్థలిలతో,పక్షుల కిలకిలారావాలతో,
🌿బెట్లుడుతల ఉయ్యాలాటల తో,దివ్య సుగంధాల తో,ఔషధీ మూలికల సంపదతో,కారణ జన్ముల కర,పాద స్పర్శతో తిరుమలకు వాయవ్యంగా సుమారు 5కి.మీ దూరంలో
🌸పాపవినాశం పోయే దారిలోఉన్నఒక సుందర చరిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం,ప్రసిద్ధ హనుమత్ క్షేత్రం.
🌿ఈ తీర్థ మహిమ వరాహ,స్కాంధ పురాణాలలో వర్ణితం.33కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహా విష్ణువు, రామావతారం దాల్చినప్పుడు, రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో,దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించుటకు నిశ్చయించుకొనెను.
🌸అప్పుడు జాపాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం గావించుకొనుటకు ఎన్నో ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ కడకు శ్రీ వేంకటాచలంలో అనగా తిరుమలలో జప, హోమాలు చేయసాగెను.
🌿అతని భక్తికి మెచ్చి భగవంతుడు తనయొక్క రాబోవు హనుమంతుని రూపాన్ని(ప్రస్తుతమున్న సింధూరకవచంలేని రూపాన్ని) స్వయంభువుగా అవతరించి చూపించెను.
🌸జపంవల్ల అవతరించి నందున ఈ స్థలం ‘జాపాలి’ అయింది.అప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందున జాపాలి తీర్థం అని పేర్కొనబడుచున్నది.
🌿ఇక్కడికి అతి సమీపంలో ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారానకు సంకల్పించినది. హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతంగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లున్నది.
🌸అలా మారిన శేషగిరిపై శ్రీ వేంకటేశ్వరస్వామి తన అభయ హస్తములతో చరణదాసుడైన హనుమంతుని చూపుతున్నట్లుగా అర్చావతారంగా నిలిచాడు.
🌿అయోధ్యకాండలో జాపాలి ఋషి తనయొక్క ధర్మవిరుద్ధమైన మాటలకు వాక్కుదోషాన్ని మూటగట్టుకొని, జపాలి తీర్థములో తపస్సుచేసి రామగుండములో స్నానమాచరించి వాక్కుదోష విముక్తుడయ్యెను.
🌸శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెడుతూ సీతాసమేతంగా ఈ తీర్థములోనే స్నానమాచరించెను.
🌿అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థం రామగుండంగా ,సీతామాత స్నానం చేసిన తీర్థం సీతాగుండమనే పేర్లతో అలరారుతున్నాయి.
🌸భక్త ధ్రువుడు మొట్టమొదట ఇచ్చోటనే తపమాచరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్రువతారయై వెలుగొందుతున్నాడు.
🌿ఇందుకు ప్రతీకగా నేటికీ ధ్రువతార అనేక ఔషధ గుణములతో నిరంతరాయంగా ప్రవహించుచూ ధ్రువతీర్థమనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఈ నీటిని ఆంజనేయస్వామి నిత్య కైంకర్యాలకు వాడటం జరుగుచున్నది.
🌿పంచమహాపాతకములు,భూతప్రేత పిశాచాది బాధలు,బ్రాహ్మణత్వం కోల్పోయినవారు,బ్రహ్మరాక్షసి పట్టినవారు ఈ తీర్థములో స్నానమాచరించడం వల్ల కష్టాలు తీరుతాయని స్కాంధ పురాణంలోని వేంకటాచల మహాత్మ్యములో చెప్పబడినది.
🌸ఎటువంటి కష్టమైనా స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్పక కష్టాలు తీరుతాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న సత్యం.
🌿జన్మ శనిగలవారు వారి పుట్టిన రోజున స్వామివారికి పూజ మరియు అభిషేకం చేస్తే శనిగ్రహం వల్ల కలిగే అనేకానేక విపత్తులు కలుగవు.
🌸శ్రీశ్రీశ్రీ హథీరాంజీ బావాజీవారు ఇక్కడే తిరుగుతూ తపస్సు చేసుకుంటూ బాలాజీ కృపకు పాత్రులయ్యారు. ప్రస్తుతం ఈ స్థలం మహంతు శ్రీశ్రీశ్రీ 1008 అర్జునదాసుగారి పర్యవేక్షణలో ఉన్నది.
🌿పూజారి 108 శ్రీ రామదాసు బాలాజీ(88 సంవత్సరములు) ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి విచ్చేసి సరైన దారులు, వసతులు లేని సమయం నుంచి శ్రీ జపాలి ఆంజనేయున్ని కొలుస్తూ ఆంజనేయస్వామి ప్రభావాన్ని భక్తులకు తెలియజేస్తూ సేవ చేస్తున్నారు.
🌸ఈ చోటు ఎందరో మహాత్ములు,సాధువులు,యోగులు సిద్ధిపొందిన చోటు.దేవతలు నడయాడిన చోటు. ఇంకా ఎన్నో లీలావిశేషాలకు, అశోకవనంలో ఆంజనేయుడు సీతమ్మ వారిని సంతోషపరచినట్లు ఎందరో జీవితాలలో ఆనందాన్ని నింపుతున్న చోటు.
🌿నేడు ఎంతోమంది ఉన్నత స్థానములలో ఉన్న చాలా మంది ఈ స్వామి భక్తులే. వారి జాబితాకు అంతే లేదు.
🌸జాపాలి తీర్థమందు జై సీతారామ్ నామాన్ని స్మరించండి. మనస్సును స్వామియందే లగ్నం చేయండి. జపాలి ప్రకృతిని వీక్షించండి. నిశ్శబ్దం వల్లే ఇది సాధ్యం. జపాలి పర్యావరణాన్ని పరిరక్షించండి. సాధువుల ఆశీర్వాదాన్ని పొందండి...
No comments:
Post a Comment