Adsense

Tuesday, May 2, 2023

కాశీ యాత్ర

 కాశీ యాత్ర 


నాయనలారా! కాశీనగరానికి మరొక పేరు శివ రాజధాని. ఇది భగీరధీ నదికి పడమరగా నది ననుసరించి వక్రము గలిగి యైదు కోసుల విస్తీర్ణమైన మహా పట్టణము. దక్షిణము నుండి ఉత్తరముగా ప్రవహించుచున్న ఈ నదీతీరముననుస రించి నగరము పొడవున అరువది నాలుగు తీర్థములున్నవి.

పూర్వం దక్ష ప్రజాపతి తన పెద్ద కుమార్తెఅయిన సతీదేవిని శివుని. కిచ్చి వివాహం చేశాడు. కాని ఒకానొక సమయంలో అల్లుడు మీద నాగ్రహించిన దక్షుడు కుమార్తెను గూడా పిలువకుండానే మహాయజ్ఞం చేయ ప్రారంభించాడు. పిలువకపోయినా పుట్టినింటి మీద మమకారం చొప్పున పెనిమిటి నొప్పించుకొని చూడవచ్చిన సతీదేవి పరాభవం పొందినందున యోగాగ్నిలో పడి చనిపోయింది. శివుని భార్యమీద మోహం పోనందున ఆమె ప్రేకాన్ని తన భుజం మీదనే వేసి కొని దేశ దేశాలు తిరిగాడు. ఆది చూసిన విష్ణుమూర్తి యోగమాయచే సతీదేవి మృత దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. అప్పుడేదేవీ ముఖం ఈ కాశీ పురంలో బడినందున దీనికి “గౌరీముఖ" మనే పేరు వచ్చింది. ఇప్పుడిది ముఖ పీఠమయింది. ఇచటి దేవత పేరు కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి మధుర మీనాక్షి మువ్వురు ప్రఖ్యాతిగల దేవతలు.

ఈ మహారాశీ క్షేత్రమునకు రాజు విశ్వ నాధుడు. మంత్రి బిందు మాధవస్వామి. క్షేత్రపాలకుడు భైరవుడు, గణనాయకు లేబదార్గురు. ఇచట లేని దేవతలు. తీర్థములు. మహిమలు మరి యెందును లేవని పురాణములు చాటి చెప్పుచున్నవి.

నాయనలారా! ఈ క్షేత్రమున యాత్రికులు నిత్యయాత్ర తిథివార యోగ్య యాత్రికులు వార్షిక యాత్రలు పంగకోశ యాత్రలు గాక ఏకరాత్ర వ్రత దీక్ష, ద్విరాత్ర వ్రత దీక్ష, త్రిరాత్ర వ్రతదీక్ష లనేకంబులుగ చేయుచుందురు, సూర్యోదయమునకు ముందుగానే మేల్కాంచి కాలకృత్యముల దీర్చుకొని గంగలో స్నానాదులు ముగించుకొని అన్నపూర్ణా విశ్వేశ్వరులను దర్శించుట ప్రధమ కర్తవ్యము.

అనంతరమున ఒకక్రోసు దూరం నందున్న బిందుమాధవస్వామిని సేవించి, విశ్వేశ్వర మందిరం దగ్గరున్న డుంఢింరాజ గణపతి నారాధించి ఉత్తరముగ ఒకటిన్నర క్రోసుదూరం నందున్న దండపాణిస్వామిని పూజించి కాల భైరవుని దర్శించి పడమర క్రోసుదూరం నందున్న కాశీమూర్తిని సేవించి వాయువ్యముగా కొంచెం దూరం నందున్న గుహను చూచి గంగాపుష్కరిణిని కొల్చి విశ్వేశ్వర మందిరమందలి అన్నపూర్ణాదేవిని పూజించి మణికర్ణికకు పోయి మణి కర్ణికమూర్తి నారాధించి అచటనే స్నానముచేసి తిరిగి విశ్వేశ్వర సన్నిధికి వచ్చి నమస్కరించి తర్వాత వసతికి చేరు విధానమును నిత్యయాత్ర యందురు.

No comments: