Adsense

Thursday, May 11, 2023

శ్రీ అన్నమాచార్య సంకీర్తన....!!

శ్రీ అన్నమాచార్య సంకీర్తన....!!

సకల లోకేశ్వరులు సరుసఁ జేకొనువాఁడు
అకలంకముగఁ బుష్పయాగంబు                  // పల్లవి //

వివిధ మంత్రములతో వేదఘోషములతో
అవల దిరువాముడియు నంగనలయాటతో
కవివందినుతులతో కమ్మఁబూజలతోడ
నవధరించీఁ బుష్పయాగంబు                    // సక //

కప్పురపుటారతుల ఘనచందనముతోడ
తెప్పలధూపముల తిరువందికాపుతో
వొప్పు బణ్యారములు వొగిఁ బెక్కువగలతో
అప్పఁ డందీఁ బుష్పయాగంబు                 // సక //        

తగుఛత్రచామరతాంబూలములతోడ
పగటుతో నీరీతి పదిపూజ లందుకొని
జిగిమీరెఁ జూడరే శ్రీవేంకటేశ్వరుని -
అగణితంబగు పుష్పయాగంబు              // సక //...

No comments: