THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Tuesday, May 9, 2023
శ్రీ మాచేనమ్మ అమ్మవారి ఆలయం, పెదమల్లం, పశ్చిమ గోదావరి
శ్రీ మాచేనమ్మ అమ్మవారి ఆలయం, పెదమల్లం, పశ్చిమ గోదావరి
💠 ఇక్కడ అమ్మవారికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. శ్రీ మాచేనమ్మ అమ్మ వారు ఆచంట మండలం పెదమల్లం గ్రామం ఆడపడుచు. ఈమె చిన్నతనం నుండి లక్ష్మీదేవి భక్తురాలు. ఈమె మనసులో ఏమి అనుకుంటే అవి జరిగేవి.
💠 ఈమె యుక్త వయస్సు వచ్చిన తరువాత వివాహము జరిగింది.
ఆమె భర్త ఒక ఆశ్రమంలో గురువు వద్ద శిష్యునిగా పనిచేస్తుండేవారు.
గురువుగారు కాశీ పుణ్యక్షేత్రం చూడటానికై తనతో తన శిస్తులని వెంట తీసుకుని వెళ్ళుటకు నిర్ణయించుకున్నారు.
💠 ఈమె భర్త భార్యతో చెప్పి కాశీకి వెళ్లారు.
ఆ సమయంలో ఈమె ఒక నెల గర్భిణి.
ఆ విషయం భర్తకు తెలియదు. సుమారు రెండు సవత్సరముల తరువాత భర్త కాశీ నుండి తిరిగి వచ్చారు.
💠 భర్త వచ్చిన సమయానికి ఈమె తన చిన్నారి పాపను ఎత్తుకుని భర్తకు చూపగా, ఈమె భర్త ఈ చిన్నారి పాప ఎవరు? అని ప్రశ్నించగా, ఆమె చెప్పిన మాటలు భర్త నమ్మక..,ఆమెను అత్తవారింటి వద్దనుండి పుట్టిల్లు అయిన పెదమల్లం గ్రామంలో దించుటకు గ్రామ పొలిమేర వద్దకు వచ్చిన తరువాత ఆమె భర్త చిన్నారి పాప ఎలా పుట్టింది అని ప్రశ్నించగా..
💠 ఆమె భర్త మనస్సును గ్రహించి భర్తను ముందుకు నడవమని చిన్నారి పాపను ఎత్తుకుని ప్రక్కగా ఉన్న పొదల చటునకు వెళ్లి తన భర్త అనుమానించుచున్నాడు కావున పంచభూతాలు సాక్షిగా భూదేవి యందు ఐక్యం చేసుకోవలసినదిగా కోరగా భూదేవి ఆమె ఉన్న చోటు నుండి దారి ఇవ్వగా ఆమె, ఆమె చిన్నారి భూదేవి యందు ఐక్యమవుతు..మాచెనమ్మ, చిన్నారి పాప శిరస్సుల వరకు భుగర్భము నందు దిగిపోవుచూ కనిపించినారు.
💠 వీరిని ఏ విధంగా రక్షించాలో భర్తకు అర్థం కాక ఆమె జుట్టు పట్టుకుని పైకి లాగగా భర్త చేతికి జుట్టు వచ్చి ఆమె, చిన్నారి పాప శిరస్సులవరకు శిలా ప్రతమలుగా మారిపోయినారు.
ఆమె భర్తకు ఏమి చెయ్యాలో తెలియక భయాందోళనతో జుట్టును ప్రక్కకు విసిరేసి అతను వెళ్ళిపోయాడు. జుట్టును విసిరేసిన ప్రదేశం నందు కొన్ని వృక్షములు మొలిచాయి.
ఆ వృక్షము పేరులేని చెట్టుగా ప్రసిద్ధిగాంచినది.
💠 కొద్ది కాలమునకు చుట్టుప్రక్కల గ్రామస్థులకు అమ్మవారు కనిపించి గ్రామ పొలిమేర నందు మాచేనమ్మా అమ్మవారు వెలిసినారు అని చెప్పగా గ్రామస్థులు వచ్చిచూడగ దివ్య సమ్మోహితమైన శ్రీ మాచేనామ్మ అమ్మవారు చిన్నారి పాప విగ్రహములు కనిపించసాగాయి.
💠 ఈమెను కొలవడం ప్రారంభించిన తరువాత కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ మాచేనమ్మ అమ్మవారు స్వచ్చమైన మహిమాన్వితం తెలుసుకుని గ్రామస్థులు గ్రామం పొలిమేర నుండి గ్రామంలోనికి తీసుకు వచ్చి,
గుడి కట్టుటకు నిర్ణయించుకుని అమ్మవారి వద్ద ఎంత మట్టి తీసిన అంత లోతుణకు శిరస్సులు వరకే కనిపించసాగారు.
సుమారు ఐదు అడుగుల బావి ఏర్పడగా అమ్మవారి ఆజ్ఞానుసారం ఆమెను ఆ ప్రదేశము యందు ఉంచసాగారు.
💠 తరువాత కొంత కాలమునకు గ్రామస్థులు గుడికట్టుటకు ప్రయత్నము చెయ్యగా అమ్మవారు కలలో కనిపించి నాకు ఎండ,వర్షం పడే విధంగా గుడి నిర్మాణము చేసి దానిపై తాటి ఆకు శిఖరము ఉండే విధంగా కోరినారు
అందుకే ఈ రోజు వరకు తాటిఆకు శిఖరం కలదు..
హరే కృష్ణ 🪈గోవిందా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment