Chicken Kurma : చికెన్ కుర్మా
చికెన్ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రౌన్ ఆనియన్స్ – ఒక కప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, బటర్ – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 2, లవంగాలు – 3, అనాస పువ్వు – 1, జాపత్రి – 1, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, మిరియాలు – పావు టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, సాజీరా – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మ్యారినేట్ చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి -అర టీ స్పూన్,మిరియాల పొడి – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్స్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – 2 టీ స్పూన్స్, పెరుగు – 100 గ్రా..
చికెన్ కుర్మా తయారీ విధానం..
ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ ను నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు వేసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత జార్ లో బ్రౌన్ ఆనియన్స్ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె, బటర్ వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత మ్యారినేట్ చికెన్ వేసి కలపాలి. దీనిని పది నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించిన తరువాత పచ్చిమిర్చి, మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ వేసి కలపాలి. వీటిని 2 నిమిషాల పాటు చిన్న మంటపై వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి.
ఇప్పుడు చికెన్ పై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిఎర్ కుర్మా తయారవుతుంది. దీనిని అన్నం, రోటీ, బగారా అన్నం, సంగటి వంటి వాటితో పాటు కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment