మామిడికాయ రసం
కావలసినవి:
కందిపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, పచ్చిమామిడికాయ(చిన్నది): ఒకటి, టొమాటోలు: రెండు, ఉప్పు: తగినంత, కరివేపాకు: 4 రెబ్బలు, ఎండుమిర్చి: రెండు, మిరియాలు: అరటీస్పూను, దనియాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, అల్లంతురుము: టీస్పూను, వెల్లుల్లితురుము: టీస్పూను, ఆవాలు: అరటీస్పూను, పసుపు: టీస్పూను, నూనె: 4 టీస్పూన్లు
తయారుచేసే విధానం:
* బాణలిలో మిరియాలు, దనియాలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేయాలి.
* మామిడికాయ తొక్కు తీసి ముక్కలుగా కోసి నీళ్లలో వేసి ఉడికించి మెత్తని గుజ్జులా చేయాలి. కందిపప్పును కూడా విడిగా ఉడికించాలి.
* టొమాటోల్ని ఉడికించి గుజ్జులా చేయాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి తురుము, రసం పొడి వేసి నీళ్లు పోసి మరిగించి పలుచని బట్టతో వడకట్టాలి. దీనికి మామిడికాయ గుజ్జు, ఉడికించి మెదిపిన పప్పు వేసి కలపాలి. ఉప్పు కూడా వేసి ఐదు నిమిషాలు మరిగించాలి..
* బాణలిలో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు అన్నీ వేసి తాలింపు చేసి రసంలో కలిపితే సరి.
No comments:
Post a Comment