కర్డ్ - మటన్ బిర్యానీ
కావలసినవి:
మటన్ - అర కేజీ
ఉప్పు - తగినంత
అల్లంవెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను
పసుపు - కొద్దిగా
పెరుగు - లీటరు
ధనియాలపొడి - టీ స్పూను
ఏలకులపొడి - టీ స్పూను
మిరియాలపొడి - అర టీ స్పూను
దాల్చినచెక్కపొడి - కొద్దిగా
నెయ్యి - వంద గ్రాములు
లవంగాలు - 10
నీళ్లు - కప్పు
బియ్యం - అర కేజీ
తయారీ:
1.మటన్‌ను ముక్కలుగా కోసి బాగా కడగాలి.
2.ఒక పాత్రలో మటన్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
3.ఒక పాత్రలో అర లీటరు పెరుగు, ధనియాలపొడి, ఏలకులపొడి, మిరియాలపొడి, దాల్చినచెక్కపొడి, కప్పుడు నీళ్లు వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని మటన్‌లో వేసి (గంటసేపు) పక్కన ఉంచాలి.
4.పెద్ద పాన్‌లో మటన్ మిశ్రమం వేసి సమానంగా సర్దాలి.
5.బాణలిలో నెయ్యి వేడి చేసి, లవంగాలు వేయించి, నెయ్యితో పాటే మటన్ మీద వెయ్యాలి.
6.బియ్యం కడిగి, మిగిలిన పెరుగును బియ్యంలో కలిపి పాన్‌లో ఉన్న మటన్ మీద వేసి సర్ది మిగిలిన నెయ్యి కూడా వేసి మూత పెట్టి మంట మీద ఉడకనివ్వాలి. ఆవిరి వస్తున్నప్పుడు సిమ్‌లో పెట్టి పావుగంట ఉడకనిచ్చి దించాలి.
7.వేడిగా ఉండగానే పెద్ద ప్లేట్‌లోకి తిరగదీసి, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
8.(నీళ్లు లేకుండా పెరుగుతో మాత్రమే వండే బిర్యానీ రెడీ).
No comments:
Post a Comment