Adsense

Monday, May 1, 2023

కడాయి పనీర్‌ కర్రీ Kadai paneer curry

కడాయి పనీర్‌ కర్రీ Kadai paneer curry

కావలసినవి

పనీర్‌- పావుకేజీ, క్రీమ్‌- రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా- పావు టీస్పూన్‌, కొత్తిమీర- ఒక కట్ట.

మసాలా కోసం: ధనియాలు- రెండు టీస్పూన్లు, జీలకర్ర- ఒక టీస్పూన్‌, మిరియాలు - అర టీస్పూన్‌, ఎండు మిర్చి- మూడు.

ఉల్లిపాయ, టొమాటో పేస్ట్‌ కోసం: నూనె- రెండు టీస్పూన్లు, అల్లం- చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు- మూడు, ఉల్లిపాయ- ఒకటి, టొమాటోలు- రెండు.

పనీర్‌ గ్రేవీ కోసం: వెన్న- ఒక టేబుల్‌ స్పూన్‌, బిర్యానీ ఆకు- ఒకటి, పచ్చిమిర్చి- ఒకటి, మెంతి ఆకులు- కొద్దిగా, ఉల్లిపాయ- ఒకటి, క్యాప్సికం- ఒకటి, పసుపు- పావు టీస్పూన్‌, కారం- అర టీస్పూన్‌, నీళ్లు- ఒక కప్పు.

తయారీవిధానం

టొమాటోలు, ఉల్లిపాయను మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. ధనియాలు, జీలకర్ర వేగించి, మిరియాలు, ఎండుమిర్చితో సహా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఒక పాన్‌ తీసుకొని వెన్న వేసి కాస్త వేడి అయ్యాక బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, మెంతి ఆకులు వేగించాలి.
తరువాత తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికం వేయాలి. పసుపు, కారం వేసి మరికాసేపు వేగించాలి. దీనిలో గ్రైండ్‌ చేసిపెట్టుక్ను టొమాటో, ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కలపాలి.
ఇప్పుడు సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పొడి కలపాలి. తగినంత ఉప్పు వేసి కాసేపు ఉడికించాలి. అవసరమైతే అరకప్పు లేదా కప్పు నీళ్లు పోయాలి. పనీర్‌ను ముక్కలుగా కట్‌ చేసి వేయాలి. క్రీమ్‌ కూడా వేసి కలపాలి. చిన్నమంటపై మరో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి దించాలి. నాన్‌తో లేదా రోటీతో తింటే రుచిగా ఉంటుంది.

No comments: