Adsense

Monday, May 1, 2023

కంద వేపుడు KANDI FRY RECEIPE

కంద వేపుడు

కావలసినవి: కంద: అరకిలో, తాజా కొబ్బరితురుము: 4 టేబుల్‌స్పూన్లు, ఆవాలు: టీస్పూను, ఎండుమిర్చి: రెండు, బెల్లం తురుము: 2 టేబుల్‌స్పూన్లు, చింతపండు: చిన్న నిమ్మకాయంత, పసుపు: అరటీస్పూను,ఉప్పు: తగినంత, తాలింపుకోసం: నూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఆవాలు: టీస్పూను, మినప్పప్పు: టీస్పూను, ఎండుమిర్చి: ఒకటి, కరివేపాకు: 2 రెబ్బలు

           తయారుచేసే విధానం:  కంద పొట్టు తీసి గోరువెచ్చని నీళ్లలో బాగా కడిగి చిన్న ముక్కలుగా కోసి మళ్లీ నాలుగైదు సార్లు కడగాలి. చింతపండు నానబెట్టి రసం తీసి తొక్కు పారేయాలి. కొబ్బరి తురుము, ఆవాలు, ఎండుమిర్చి మిక్సీలో రుబ్బాలి.  ప్రెషర్‌ పాన్‌లో నూనె వేసి తాలింపు దినుసులన్నీ వేసి వేగాక కందముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. తరవాత బెల్లం తురుము, చింతపండు రసం, పసుపు, ఉప్పు వేసి ఓ కప్పు నీళ్లు పోసి మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి. నీళ్లన్నీ ఆవిరైపోయి ముక్కలన్నీ ఉడికిన తరవాత కొబ్బరి మిశ్రమం వేసి కలిపి పొడిపొడిలాడేలా వేయించాలి.

No comments: