Adsense

Monday, May 1, 2023

మైసూర్‌ రసం MYSORE.RASAM RECEIPE

మైసూర్‌ రసం

కావలసినవి:
కందిపప్పు: 3 టేబుల్‌ స్పూన్లు, చింతపండు: రెండు మీడియం సైజు నిమ్మకాయలంత, టొమాటోలు: నాలుగు, కొత్తిమీర: కట్ట, కొబ్బరి తురుము: 4 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, పొడికోసం: దనియాలు: 3 టీస్పూన్లు, ఆవాలు: అరటీ స్పూను, జీలకర్ర: టీ స్పూను, మెంతులు: టీ స్పూను, ఎండుమిర్చి: నాలుగు, కరివేపాకు: 6 రెబ్బలు, మిరియాలు: అరటీస్పూను, తాలింపుకోసం, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, నూనె: కొద్దికొద్దిగా.

తయారుచేసే విధానం:

* ముందుగా బాణలిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించి తీసి చల్లారనివ్వాలి. అదే బాణలిలో టీస్పూను నూనె వేసి ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగాక చల్లారనివ్వాలి. ఇప్పుడు అన్నీ కలిపి మెత్తగా పొడి చేయాలి.
* ముందుగా కందిపప్పును మెత్తగా ఉడికించి మెదిపి పక్కన పెట్టుకోవాలి. 
* చింతపండును నానబెట్టి మొత్తం ఒకటిన్నర లీటర్ల రసం తీయాలి. ఈ రసాన్ని ఓ మందపాటి బాణలిలో పోసి మరిగించాలి.
* అందులో ఉడికించి మెదిపిన కందిపప్పు, సన్నగా కోసిన టొమాటోలు, రసం పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి పదినిమిషాలు మరిగించాలి.
* తరవాత దించి తాలింపు చేసి కొబ్బరి తురుము చల్లి వడ్డించాలి.

No comments: