టొమాటో పెరగు కూర
కావల్సినవి: టొమాటోలు - నాలుగు, పెరుగు -ముప్పావుకప్పు, పసుపు - అరచెంచా, కారం - రెండు చెంచాలు, అల్లం వెల్లుల్లిపేస్టు - చెంచా, ఉప్పు - తగినంత, గరంమసాలా పొడి - చెంచా, వేయించిన పల్లీలు - అరకప్పు, గసగసాలు - మూడు టేబుల్‌స్పూన్లు, సెనగపిండి -కొద్దిగా, ఉల్లిపాయలు - రెండు, కొత్తిమీర తరుగు - పావుకప్పు, నూనె -పావుకప్పు.
తయారీ: పెరుగులో పసుపూ, కారం, అలం వెల్లుల్లి పేస్టూ, సెనగపిండీ, గరంమసాలాపొడీ, ఉప్పూ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. టొమాటోలకు అక్కడక్కడా గాట్లు పెట్టి పెరుగులో వేసి కనీసం అరగంట వదిలేయాలి. ఇప్పుడు పల్లీలూ, గసగసాలను మిక్సీలో తీసుకుని కొద్దికొద్దిగా నీళ్లు చల్లుతూ మెత్తని మిశ్రమంలా చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెను వేడిచేసి ఉల్లిపాయముక్కల్ని వేయించాలి. ఆ తరవాత పెరుగులో వేసిన టొమాటోలను అందులో వేసి మంట తగ్గించాలి. టొమాటో ముక్కలు బాగా మగ్గాక పెరుగు వేయాలి. అది దగ్గరకు అయి గ్రేవీలా తయారయ్యాక పల్లీల మిశ్రమం వేసి కలపాలి. అది కూడా వేగాక కొత్తిమీర తరుగు చల్లి దింపేయాలి.
No comments:
Post a Comment