Adsense

Monday, May 1, 2023

ఆలూ పనీర్‌ టిక్కా ALU PANEER TIKKA

ఆలూ పనీర్‌ టిక్కా

కావలసినవి

మీగడ - అరకేజీ, బంగాళదుంపలు - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, ఉప్పు - తగినంత, మైదా - అరకప్పు, శనగపిండి - పావుకప్పు, నూనె - తగినంత, బ్రెడ్‌ ముక్కలు(ఎండినవి) - మూడు, తాజా బ్రెడ్‌ - ఒకటిన్నరకప్పు, కారం - అర టీస్పూన్‌, రెడ్‌ క్యాప్సికం - ఒకటి.

తయారీవిధానం

బంగాళదుంపలు ఉడికించుకుని మెత్తగా చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలుపుకోవాలి. మీగడను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒకపాత్రలో మైదా, శనగపిండి తీసుకొని ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. మరొకపాత్రలో ఎండిన బ్రెడ్‌ముక్కలు, తాజా బ్రెడ్‌ ముక్కలు వేసి కలపాలి. తగినంత ఉప్పు, కారం, మీగడ ముక్కలు వేసి కలియబెట్టాలి. మెత్తగా చేసుకున్న బంగాళదుంప మిశ్రమంను చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను రెండు మీగడ ముక్కల మధ్య పెట్టి ఒత్తుకోవాలి. ఇలా అన్ని ఉండలు చేసుకోవాలి. ఆ ఉండలపై మైదా, శనగపిండి మిశ్రమం పోయాలి. ఒకపాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆ ఉండలను గోధుమరంగు వచ్చే వరకు వేయించుకోవాలి. క్యాప్సికం ముక్కలతో గార్నిష్‌ చేసుకోని సర్వ్‌ చేసుకోవాలి

No comments: