హిందూ మతంలో నాగ పంచమి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షతో పాటు నాగేంద్రుడికి పాలు, గుడ్లు, పాయసం, గోధుమలతో సమర్పిస్తారు. స్కంద పురాణంలో నాగ పంచమి విశిష్టతను సాక్షాత్తు ఈశ్వరుడే వివరించాడు. ఆదిశేషుని సేవకు శ్రీ మహా విష్ణువు సంతోషించాడు. ఈ పవిత్రమైన రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అనారోగ్యం నుంచి తప్పించుకోవచ్చని చాలా మంది నమ్ముతారు. సంతానం లేని దంపతులు నాగపూజలు చేయడం వల్ల కచ్చితంగా శుభ ఫలితాలొస్తాయి. అంతేకాదు కాలసర్పం, నాగ దోషాలు తొలగిపోతాయి.
నాగ పంచమి ఎప్పుడంటే...
ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీ సోమవారం నాడు నాగ పంచమి పండుగ వచ్చింది. నాగ పంచమిని బ్రహ్మదేవుడు, ఆదిశేషుడు అనుగ్రహించిన రోజుగా భావిస్తారు. నాగుల చవితి మాదిరిగానే నాగ దేవతను పూజించి, పుట్టలో పాములకు పాలు పోస్తారు. సర్ప పూజతో సంతాన ప్రాప్తి, రాహు, కేతు దోషాలన్నీ తొలగిపోతాయి. నాగ పంచమి వేళ శ్రీకాళహస్తీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల రాహు, కేతు, సర్ప, కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. నాగ పంచమి రోజున అనంత పద్మనాభ స్వామికి అభిషేకం, అలంకారాలు చేయించిన వారికి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
గరుడ పంచమి..
త్రేతా యుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు. యమునా నదిలో శ్రీ క్రిష్ణుడు కాళీ మర్దనం చేసే రోజునే నాగ పంచమిగానూ, గరుడ పంచమిగానూ జరుపుకుంటారని పండితులు చెబుతారు. నాగ పంచమి రోజున కొందరు నాగదేవత బొమ్మలను తయారు చేసి పూజలు చేస్తారు. ఈరోజున మట్టి తవ్వడం, చెట్లను నరకడం వంటివి చేయకూడదని పెద్దలు చెబుతారు.
గరుడ పంచమి..
పురాణాల ప్రకారం, కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు వినత, కద్రువ. వీరి సంతానమే గరుత్మంతుడు, నాగులు. శ్రావణ పంచమి రోజునే గరుత్మంతుడు కద్రువకు నాగులు జన్మించారు. అందుకే నాగ పంచమిని గరుడ పంచమి పేర్లతో పిలుస్తారు. సంతానం కోరుకునే వారంతా ఈ వ్రతం చేస్తారు. అయితే ఈ వ్రతం కేవలం సోదరులు ఉండే మహిళలు మాత్రమే గరుడ పంచమి వ్రతం చేస్తారు. ఈ వ్రతం కేవలం సోదరులన్న స్త్రీలు మాత్రమే చేయాలనే నియమం ఉంది.
No comments:
Post a Comment