THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Saturday, August 19, 2023
చింత చిగురు మాంసం కూర ఎలా చేయాలి?
కావలసినవి: మటన్ – అర కేజీ; చింత చిగురు – 150 గ్రా.; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 5; కరివేపాకు – రెండు రెమ్మలు; అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 5; నూనె – 50 మి. లీ.; జీలకర్ర – ఒక టీ స్పూను; కారం – 3 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – తగినంత; నీళ్లు – సరిపడా.
తయారీ:
►మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి
►చింత చిగురును శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి
►స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక, జీలకర్ర, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించాలి
►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి మరోమారు వేయించాలి
►సిద్ధంగా ఉంచిన మటన్ జత చేసి బాగా కలియబెట్టాలి
►పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి గరిటెతో కలపాలి
►టొమాటో తరుగు వేసి బాగా కలిపి, చింత చిగురు కూడా జత చేసి బాగా కలిపి, తగినన్ని నీళ్లు పోసి కుకర్ మూత ఉంచి ఆరేడు విజిల్స్ వచ్చాక దింపేయాలి
►చివరగా సిద్ధంగా ఉంచిన కొత్తిమీరను పైన అలంకరించాలి
►అన్నంలోకి, రోటీలలోకి ఈ కూర రుచిగా ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment