Adsense

Saturday, August 19, 2023

రుచికరమైన #ఇడ్లీ మంచురియా


కావలసిన పదార్థాలు:
ఇడ్లీలు- 4,
మైదా- 3
టేబుల్‌ స్పూన్లు,
కార్న్‌ఫ్లోర్‌- 3 టేబుల్‌ స్పూన్లు,
అల్లంవెల్లుల్లి ముద్ద- అర టీ స్పూను,
కారం- అర టీ స్పూను,
నూనె- 3 టేబుల్‌ స్పూన్లు,
ఉప్పు- తగినంత.

సాస్‌ తయారీ కోసం: నూనె- 2 టేబుల్‌ స్పూన్లు,
తరిగిన ఉల్లిపాయ- ఒకటి,
తరిగిన క్యాప్సికం,
ఉల్లికాడలు- ఒక్కో టేబుల్‌ స్పూను చొప్పున,
తరిగిన అల్లం,
వెల్లుల్లి- ఒక్కో టీ స్పూను,
టమోటా సాస్‌- ఒక టేబుల్‌ స్పూను,
సోయా సాస్‌- పావు టీ స్పూను,
చిల్లీ సాస్‌- అర టీ స్పూను,
కారం- పావు టీ స్పూను,
కార్న్‌ఫోర్ల్‌- ఒక టీ స్పూను,
ఉప్పు,
మిరియాల పొడి- తగినంత.

తయారీ విధానం:
ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం వేసి బాగా కలుపుకోవాలి.
అవసరమైతే కొన్ని నీళ్లు పోసి ఈ మిశ్రమాన్ని ఇడ్లీ ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఇడ్లీ ముక్కల్ని బజ్జీల్లా వేగించి దింపేయాలి.
సాస్‌ తయారీ కోసం మరో బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు, క్యాప్సికం వేసి వేగించాలి.
రెండు నిమిషాల తర్వాత సోయా సాస్‌, టమోటా సాస్‌, చిల్లీసాస్‌, ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్‌ను నీటిలో కలిపి పోసి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
చివరగా ఇడ్లీ ముక్కలను దానిలో వేసి అర నిమిషం వేగించి దింపేయాలి.

No comments: