Adsense

Saturday, August 19, 2023

హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం పానీ పూరి ఎలా తయారు చెయ్యాలో చూద్దాం.

హాయ్ ఫ్రెండ్స్!ఈరోజు మనం పానీ పూరి ఎలా తయారుచెయ్యలో చూద్దాం.

ఫ్రెండ్స్!పానీ పూరి చెయ్యడానికి ముందుగా ఒక బౌల్లో 1కప్ బొంబాయి రవ్వ,1/4మైదాపిండి,తగినంత ఉప్పు,1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.

అలా కలుపుకున్న పిండిని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

20 నిమిషాలు పూర్తయ్యాక ఆ పిండిని చపాతీ ఉండల్లా చేసుకొని చపాతీ రుద్దుకోవాలి.

అలా రుద్దుకున్న చపాతీ ని ఒక రౌండ్ షేప్ కట్టర్ తో చపాతీ ని కట్ చేసుకోవాలి.

అలా కట్ చేసుకున్న పూరి లను నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.

అంతే పూరీలు రెడి.


ఇప్పుడు పానీ తయారీ కోసం ఒక మిక్సీ జార్ లో 1 కప్ కొత్తిమీర,3/4 కప్ పుదిన,3 పచ్చిమిర్చి,కొన్ని నీళ్లు పోసి బ్లెండ్ చేసుకోవాలి.

అలా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ ను ఒక పెద్ద బౌల్ లోకి తీసుకొని అందులో 2 కప్స్ వాటర్,తగినంత ఉప్పు,కొంచెం నిమ్ముప్పు వేసి బాగా కలుపుకోవాలి.

అలా కలుపుకున్న తరువాత అందులో కొన్ని భుంది వేసి కలపాలి.

అంతే ఎంతో టేస్ట్ గా ఉండే పానీ పూరి రెడి.

No comments: