Adsense

Saturday, August 19, 2023

పచ్చిశనగపప్పు తో కొబ్బరి కూర చేద్దాం రండీ



పచ్చిశనగపప్పు  ఒక కప్పుడు తీసుకుని  సరిపడా నీరు పోసి చేత్తో పట్టుకుంటే బద్ద చితికే వరకు  ఉడకనివ్వాలి .

ఆ తర్వాత నీరు వార్చు కోవాలి .

పచ్చి కొబ్బరి  ఒక చిప్ప కొబ్బరి  తురుముతో తురుము కోవాలి .

స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి  మూడు ఎండు మిరపకాయలు  ముక్కలుగా  తుంపి , స్పూను చాయమినపప్పు , అర స్పూను  ఆవాలు , పావు స్పూను  జీలకర్ర , కొద్దిగా  ఇంగువ , రెండు రెమ్మలు కరివేపాకు  మరియు  పచ్చిమిర్చి  మూడు ముక్కలుగా చేసి వేసుకుని  పోపు వేసుకోవాలి .

అందులో ఉడక పెట్టిన పచ్చిశనగపప్పు , కొద్దిగా  పసుపు ,  తగినంత  ఉప్పు , స్పూను కారం వేసుకుని ఓ అయిదు నిముషాలు మూతపెట్టి మీడియం సెగన మగ్గ నివ్వాలి .

చివరలో తురిమి ఉంచుకున్న  పచ్చి కొబ్బరి  తురుము వేసుకుని  మరో మూడు నిముషాలు ఉంచి  దింపుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే పచ్చిశనగపప్పు తో కొబ్బరి కూర సర్వింగ్  కు సిద్ధం.

ఈ కూరకు కాంబినేషన్ గా చింతపండు  పచ్చడి కాని అల్లం పచ్చడి కాని చాలా రుచిగా  ఉంటుంది.

No comments: