Adsense

Saturday, August 19, 2023

మీల్ మేకర్ అంటే ఇష్టం లేని పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు.



చాలామంది పిల్లలకు మీల్మేకర్ అంటే ఇష్టం ఉండదు.అందుకోసమని వారి కోసం కొంచెం కొత్తగా వండాలి. అప్పుడు వారు వాటిని ఇష్టంగా తింటారు.
మీల్ మేకర్ పలావ్ వండడానికి ముందుగా మనం వండిన అన్నము మరియు వేడి నీటిలో కడిగి శుభ్ర పరచుకున్న మీల్మేకర్ని సిద్ధం చేసుకోవాలి.
ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని అది వేడెక్కా దాంట్లో రెండు లవంగాలు, దాల్చిన చెక్క, రెండు యాలకులు,రెండు బిరియాని ఆకులు వేయాలి. అది కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.  అవి కూడా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు,పసుపు,ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు దాంట్లో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న మీల్మేకర్ని వేయాలి. ఇవి కొంచెం వేగాక ముందుగా వండుకుని ఉంచుకున్న అన్నం ని వేయాలి. ఈ అన్నాన్ని కొద్దిసేపు కలిపి గరం మసాలా వేసి మళ్లీ కలపాలి. ఐదు నిమిషాలు బాగా కలుపుతూ చివర్లో కొత్తమీర వేసి కలపాలి.

No comments: