THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Wednesday, September 6, 2023
పుదుచ్చేరి శ్రీలక్ష్మీ హయగ్రీవస్వామి.....!!
శ్రీమహావిష్ణువు ఎత్తిన అనేక అవతారాలలో హయగ్రీవావతారం ఒకటి. బ్రహ్మదేవుని నుండి మధు, కైటభులనే రాక్షసులువేదాలను అపహరించినప్పుడుమహావిష్ణువుమత్స్యావతారం దాల్చివేదాలను కాపాడాడు.
🌿కాని దానవుల హస్తాలలో పడి
వేదాలు పవిత్రతను కోల్పోయినవి. బ్రహ్మదేవుడు ఆ వేదాలను సక్రమంగా వినియోగించలేక పోయాడు. అందు వలన మహావిష్ణువుహయగ్రీవావతారం ధరించి వేదాలను తిరిగిఉపదేశించాడు.
🌸హయగ్రీవ స్వామి స్వఛ్ఛమైన శ్వేతవర్ణుడు.వేదవేదాంగములకు,సకల శాస్త్రములకు , 64కళలకు ఆధార భూతుడు. హయగ్రీవుని అనుగ్రహం తోనే సరస్వతీదేవి విద్యలకు అధిదేవత అయినది. వేదవ్యాసుల వారిని ఆనుగ్రహించినది హయగ్రీవ స్వామి.
🌿హయగ్రీవ స్వామి ఆలయాలు తిరువహీంద్రపురం, చెట్టిపుణ్యము ఊళ్ళలో హయగ్రీవాలయాలు వున్నవి. అలాగే పుదుచ్చేరిలో హయగ్రీవునికి ఒక ప్రత్యేకఆలయం వున్నది.
🌸1971 వ సంవత్సరంలో నిర్మించబడిన యీ ఆలయంలో మూడు కుంభాభిషేకాలు జరిగాయి. ఈనాడు మూడు అంతస్థుల రాజగోపురుతో బంగారు పూతతో మెరిసిపోతూ వుంటుంది ఆలయం.
🌿గర్భగుడిలో లక్ష్మీ హయగ్రీవ స్వామి అద్భుతమైన దర్శనంప్రసాదిస్తున్నాడుకోరిన కోరికలు నెరవేర్చే దైవంహయగ్రీవ స్వామి. ముఖ్యంగా ఉన్నత విద్యలు చదివే విద్యార్థులుయీ స్వామిని భక్తి శ్రధ్ధలతో పూజిస్తారు. మూలవిరాట్ సన్నిధిలో పంచలోహ విగ్రహంగా తీర్ధ
🌸హయగ్రీవస్వామి , యోగ హయగ్రీవ స్వామి, డోలి హయగ్రీవ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, మొదలైన విగ్రహాలు ఉత్సవమూర్తులుగాదర్శనమిస్తున్నాయి.
🌿ఇక్కడి ఆలయంలోని వేణుగోపాస్వామి మూర్తి పుదుచ్చేరి సముద్రంలోదొరకడం ఒక విశేషం మూలవిగ్రహానికి ముందు గరుత్మంతుడు ,విగ్రహానికివెనుక సర్ప విగ్రహాలు వున్నవి.
🌸గర్భగుడి కి పక్కనేవున్న మండపంలో బాలాంజనేయస్వామి,కళ్యాణోత్సవ మూర్తులుగా లక్ష్మీ హయగ్రీవుల విగ్రహాలుదర్శనమిస్తాయి.
అదే మండపంలోని మరో భాగంలో
అహోబిల జ్వాలా నరసింహస్వామి,
🌿మాలోలనరసింహస్వామిదర్శన మిస్తారు. శ్రావణమాసం లో శ్రవణ నక్షత్రం రోజున హయగ్రీవ జయంతి.ఆరోజు నుండిపదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు అతిఘనంగా జరుపుతారు.
🌿విద్యలలో రాణించడానికి లక్ష్మీ హయగ్రీవస్వామిని బుధవారం రోజున; కుటుంబంలోసఖ్యత,సుఖసంతోషాలకోసం,సంతానభాగ్యానికి, వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగి పోవడానికి గురువారం నాడు ప్రత్యేక పూజలు జరుపుతారు.
🌸శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి సహస్రనామపూజలు జరిపి ,అక్కడి తీర్ధంలోలక్ష్మీనారాయణ హృదయం స్తోత్రం జపించి ఆపుణ్య తీర్ధాన్ని ప్రసాదంగా యిస్తారు.
🌿శనివారం నాడు మూలవిగ్రహానికి విశేష పూజలు అర్చనలు జరుపుతారు.పుదుచ్చేరి నగర నడిబొడ్డునున్న ముత్యాలపేట రామకృష్ణానగర్ లోయీ ఆలయం నిర్మించబడినది...స్వస్తీ..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment