అరిటాకులో వడ్డించడం అనేది చాల సింపుల్ .
మనుషులు సాధారణంగా కుడి చేతి తో భోజనం చేస్తారు కాబట్టి వడ్డించడం అనేది ఆ పద్దతిని బట్టి జరుగుతుంది .
అరిటాకు ఎడమ కొన వైపు తక్కువ స్థలం ఉంటుంది మరియు అది ఎడమవైపు భాగం కాబట్టి ఆ ప్రాంతంలో తక్కువగా వాడేవి మరియు తక్కువగా వడ్డించేవి ఐన ఉప్పు ఊరగాయ వేయించిన వడియాలు లాంటివి వడ్డిస్తారు. ఆ తరువాత కుడి వైపుకు వస్తూ ఉండగా అరిటాకులో స్థలం పెరుగుతూ వస్తుంది కాబట్టి కాస్త ఎక్కువగా తినేవి మరియు కాస్త ఎక్కువ మొత్తంలో వడ్డించేవి అయిన పచ్చళ్ళు మరియు కూరలు ఆకు లో పై వైపు మరియు పులిహోర లాంటివి ఆకులో కిందవైపు వడ్డిస్తారు.
అలా ఇంకా మన కుడి వైపుకు వస్తుంటే అక్కడ స్థలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో వడ్డించేవి మరియు కాస్త పలచగా ఉండేవి అయిన పప్పు లాంటివి ఆకులోపై వైపు వడ్డిస్తారు . ఇక కిందవైపు అన్నము దాని పక్కనే పాయసము లాంటివి వడ్డిస్తారు.
అరిటాకులో వడ్డన అనేది ప్లేస్ మానేజ్మెంట్ మరియు మన భోజనానికి అనుకూలంగా ఉండేలా వడ్డించడం, అంతే . ఈ పద్దతి పాటిస్తూ మనదగ్గర వుండే పదార్థాలు వడ్డించేయడమే .
No comments:
Post a Comment