Adsense

Friday, January 26, 2024

ధర్మా నుష్ఠాన చంద్రిక (మన సంప్రదాయం)

శ్రీ హనుమద్యానం:

గోప్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే2 నిలాత్మజమ్ అంజనా నందనం వీరం జానకీ శోక నాశనం కపీశ మాక్షహంతారం వందే లంకా భయంకరమ్॥ యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రకృతమస్త కాంజలిం బాషువారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం

జయపంచకం:

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః॥ దాసో2 హం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణ: హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః। నరావణ సహస్రంమే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః॥ అర్ధయిత్వా పురీం లంకా మభివాద్యన మైథిలీం సమృద్ధార్థోగమిష్యామి మిషతాం సర్వరక్షసామ్॥ (సుందరకాండ 42వ వర్గ, 33, 34, 35, 36 శ్లోకములు)

ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరధిర్యది పౌరుషేచా2 ప్రతి ధ్వంద్వ శరైనం జహిరావణిం||
(యుద్ధకాండ 91వ సర్గ 73 శ్లోకం).


నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుర్రేన్ద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః॥

(సుందరకాండ 13వ సర్గ 50 శ్లోకం)

ఈ శ్లోకమును రోజుకు 11 పర్యాయములు చొప్పున 40 రోజులు పఠించిన కార్యసిద్ధి యగును.

మిక్కిలి శుభప్రదమైన నెమలికన్నుల వింజామరను శంకరునికి సమర్పించిన వారికి కోటి సంవత్సరములు శివలోక ప్రాప్తి కలుగును.

గాయత్రికి మించిన మంత్రం. తల్లికి మించిన దైవంలేదు. ప్రణవముతో సమానమైనది రామనామము.

జ్ఞానాన్ని అందుకోవాలంటే తారకనామం చేసితీరాలి.

కృష్ణ కృష్ణ కృష్ణ - అని ముమ్మారు నిత్యము పఠించినచో పది వేల యజ్ఞములు చేసిన ఫలము వచ్చును.

హరేరామ హరేరామ అను అష్టాక్షరీ మంత్రం నిత్యము ఎవరు జపము చేయుదురో వారు ఛండాలురైనను తరింతురు. సర్వపాప విముక్తులగుదురు. శాశ్వత ముక్తిని పొందుదురు.

"శ్రీరామ జయ రామ జయ జయ రామ" అను మంత్రము నిత్యము 73 సార్లు పఠించిన సర్వ కార్యసిద్ధిని కలిగించును.

సమస్త దేవతలకు 'అగ్ని' ముఖము కనుక 'అగ్నిని సేవించిన సమస్త ఐశ్వర్యములు కలుగును.

జీర్ణించిన శివాలయములో ఒక అభిషేకము చేస్తే రోజూ అర్చకత్వం జరుగుచున్న శివాలయంలో పది అభిషేకములు చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం కలుగును.


మానవ ధర్మములు:

1) ఉదయమున లేవగానే ధ్యానించవలసిన శ్లోకములు :

1) యస్మాత్ జాతం జగత్సర్వం యస్మి స్వవ ప్రపద్యతే యేవేదం ధార్యతేనైన తస్యై జ్ఞానాత్మనే నమః॥

2) త్రైలోక్య చైతన్యమయా ఆదిదేవా శ్రీనాథా విస్లో భవదాజ్ఞయైవ ప్రాతస్సముత్థాయ తవప్రియార్థం సంసారయాత్రాం అనువర్తష్యే॥

3) సుప్త: ప్రబోధితో విష్ణో హృషీకేశేన యత్తయా యద్యత్ కారయసే కర్మ తల్ కరోమి తవాజ్ఞయా॥

2) సముద్ర వసనే దేవీ పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శాం క్షమస్వ మే॥

ఈ భూ ప్రార్థన, మంచము మీద కూర్చుని చేతులు భూమిమీద ఆన్చి చేయవలెను. తర్వాత కాళ్ళు భూమిమీద ఉంచాలి.

3) సూర్యోదయమునకు ముందుగానే నిద్ర లేవాలి.

4) సూర్యోదయమునందు నిద్రించువాడు అభినిర్ముక్తుడను పాతకుడగును.

5) సూర్యాస్తమయమందు నిద్రించువాడు అంశుమాన్ అను పాతకుడగును.

6) సూర్యునికి ఎదురుగా దంతధావన చేయరాదు. దంత ధావన మధ్యవ్రేలితో చేయవలెను.


7) దంతధావన నడుస్తూ చేయరాదు. ఉమ్మిలో పాచివుండుట వలన చీమలు మొదలగునవి తిని మరణించును. ఆ పాపము ఉమ్మిన వారికి కలుగును.

8) మల మూత్ర విసర్జనమును సూర్య చంద్రులకు ఎదురుగా చేయరాదు. గాలికి ఎదురుగా చేయవలెను.

9) తెల్లవారు జామున

4-5 గం|| మధ్య చేయు స్నానం ఋషి స్నానం

5-6 గం|| మధ్య చేయు స్నానం దైవ స్నానం

5-7 గం|| మధ్య చేయు స్నానం మానవ స్నానం 7 గం|| తర్వాత చేయు స్నానం రాక్షస స్నానం

10) చన్నీటి స్నానం ఉత్తమము ప్రవాహ ఉదకమున స్నానం ఉత్తమోత్తమము. చెరువుల' స్నానం మధ్యమము నూతివద్ద స్నానం అధమము.

మిగిలిన స్నానములకు పేర్లు లేవు. వేయి పనులు ఉన్నను మాని సకాలములో స్నానము చేయవలెను.

11) ప్రవాహమునకు ఎదురుగా పురుషులు, వాలుగా స్త్రీలు సౌవనం చేయవలెను. (కుమారస్వామి జననము ఆధారముగా)

12) ఒక నదిలో స్నానము చేయుచు మరొక నదిని దూషించరాదు.

13) చన్నీటి స్నానము - శిరస్సు తడుపుకొని ప్రారంభించవలెను. (శిరస్సునందు జ్ఞాన కణములుండును కావున వాటిని రక్షించుకొనుటకు)

14) వేడి నీటి స్నానము పాదములు తడుపుకొని ప్రారంభించవలెను. (నరములకు బలము కనుక)

15) స్నానము చేయునపుడు దేహమును పైనుండి క్రిందకి రుద్దుకొనిన కామేచ్చ పెరుగును. అడ్డముగా రుద్దుకొనిన కామం నశించును.


16) సముద్ర స్నానమునకు వెళ్ళునపుడు ముందుగా చన్నీటి స్నానము చేసి, సముద్ర స్నానము చేయవలెను. తరువాత మరల చన్నీటి స్నానము చేయవలెను.

17) 15 నిమిషములు దాటి సముద్రంలో స్నానము చేసినచో పుంసత్వము నశించును.

18) మంగళ, శుక్రవారములలో సముద్రస్నానం చేయరాదు. 

19) సముద్ర స్నానం వైశాఖ, ఆషాఢ, కార్తీక, మాఘు
మాసములయందు, అర్ధోదయ, మహోదయ సమయములయందు చేయవలెను.

20) సముద్ర స్నానం చేయునపుడు బయట మట్టిని లోపల వేయవలెను. (సముద్రుని మా ఊరు రావద్దని).

21) నదులు, కాలువలు, చెరువులలో స్నానమునకు వెళ్లినపుడు, లోపల మట్టిని ముమ్మారు బయట వేయాలి. (అవి శాశ్వతంగా ఉండుట 5050)

22) స్నాన సమయమందు మౌనముగా ఉండనిచో తేజస్సు హరించును.

23) సూర్యోదయమునకు ముందుగానే స్నానము చేసిన సూర్యుని శక్తి నీటిలో ఉండును కనుక

24) పురుషుడు వస్త్రములోనే స్నానము చేయవలెను. లేకున్న దేహము పిశాచగ్రస్తము అగును. స్త్రీదిగంబరముగా స్నానము చేయవచ్చునని శాస్త్రము ఉన్నది.

25) స్నానమునకు వెళ్లునప్పుడు పాత్ర,  మీద బట్ట రెండూ ఉండవలెను. లేనిచో అశుభము.

26) స్నానానంతరము ముందుగా ముఖము, తర్వాత వక్షము, పిదవ శిరస్సు మిగత భాగములు తుడుచుకొనవలెను. ముందుగా శిరస్సు తుడుచుకొనిన దరిద్రం కలుగును.


27) స్త్రీలు స్నానము చేయునపుడు జుట్టు చివర ముడి వేసుకొనవలెను. లేనిచో దేవాము పిశాచగ్రస్తమగును.

28) స్నానము చేయుటకు కట్టుకొని, తడిపిన బట్టను క్రిందికి వదలవలయును. ఈ బట్టను తానైనా ఉతికి ఆరవేయవలయును లేదా భార్య, పిల్లలు ఆరవేయవలెను. అంతేకాని ఇతరుల కివ్వరాదు.

29) బట్టలు మార్చుకొనేటప్పుడు పొడి బట్టను పైకి తీయవలెను. క్రిందకు విడువదు.

30) స్నానము ఎక్కువసేపు చేయవలెను.

31) స్నానములు మూడు రకములు. అవి

1. అభ్యంగన స్నానము (తలంటు పోసుకొనుట)

2. అవబ్బద స్నానము (దీక్ష చివర చేయునది)

3. అఘమర్షణ స్నానం (తడి బట్టచే దేహము రుద్దుకొనుట. జ్ఞానము బాగుగా

32) ఆదివారం తలంటు స్నానము - తాపముj 
సోమవారం - శాంతి
మంగళవారం - మృతి
బుధవారం -  లక్ష్మి
గురువారం -  ధననాశనము
శుక్రవారం- విపత్తు
శనివారం - భోగము
కలుగుచేయును. (ఇవి పురుషులకు మాత్రమే)

33) శిరస్సు స్నానం చేసినపుడే తడి విభూదిని పెట్టుకొనవలెను. కంఠ స్నానం చేసినపుడు పొడి విభూదిని పెట్టుకొనవలెను.

34) విభూదిని ముందుగా బొటన వ్రేలులో కుడి నుండి ఎడమకు పెట్టుకొని, మధ్యవ్రేలితో సరిచేసి తరువాత మధ్య మూడు వ్రేళ్లతో పెట్టుకొనవలెను.


35) విభూదిని మూడు గీతలుగా పెట్టుకోవడమంటే సత్య రజస్తమో గుణములకు అతీతుడని అర్థము.

36) కనుబొమ్మల మధ్య జ్ఞాన వేత్రము వుంటుంది కావున దానికి ఆచ్ఛాదనముగా కుంకుమ ధరించవలెను.

37) చూపుడు వ్రే౦లో బొట్టు పెట్టుకోరాదు.

38 మాతన వస్త్రములు బొట్టు లేకుండా యిచ్చినచో పుచ్చుకొన్నవారు ఆరుమాసములలో మరణింతురు.

39) ముక్కు మొదలు, నాలుక చివరరెండూ కనిపించనిచో ఆరు మాసములలో మరణింతురు.

40) మానవుడు కర్పూర హారతి పుచ్చుకోరాదు.

41) పూజా పుష్పము శిరస్సుపై పెట్టుకోవలెను.

42) దళమును కుడిచెవిలో పెట్టుకోవలెను. బాహ్యమునకు వెళ్ళునపుడు జందెమును కుడిచెవికి చుట్టుకోవలెను.

43) భోజనానికి విస్తరి వేసినపుడు, అరటి ఆకు చివర కూర్చొనిన వారికి ఎడమవైపు వుండునట్లు వేయవలెను. కుడివైపునకు వుండునట్లు చేయరాదు.

44) చివరిలేని విస్తరి చర్మములో సమానము. కుట్టుడు ఆకు వేయవచ్చును.

45) ఇతరులకు భోజనము పెట్టినపుడు, యజమాని వారిని తన కుడివైపున కూర్చోపెట్టుకోవలెను.

46) భోజనానంతరం మజ్జిగ త్రాగవలెను.

47) ఒంటిగా భోజనం చేసిన పేరు లేదు. ఇద్దరు కూడిన భుక్తి ముగ్గురు కూడిన భోజ్యము నలుగురు కూడిన భోజనము కావున యజమాని తన బిడ్డలతో కలసి భోజనం చేయవలెను.


48) భార్యా భర్తలు కలిసి భుటింపచు (ఆయుక్షీణం)

49) భోజన సమయమునందు మంచినీటి చెంబును కుడివైపున వుంచుకొనవలెను.

50) ఉత్తర దిక్కుగా కూర్చొని భోజనం చేయరాదు.

51) పీట మీద ఒక కాలు, క్రింద ఒక కాలు వుంచి భోజనం చేయరాదు.

52) ఒంటి బట్టతో భోజనం చేయరాదు.

53) రెండు చేతులతో తప్ప, ఒంటి చేతితో నమస్కారం చేయరాదు.

54) నమస్కారం చేయునపుడు నమస్తే అనరాదు. పెద్దలకు "నమో నమ:" సామాన్యులకు "నమోవ:"" అనాలి.

55) పాదాభివందనము చేయువారు. తమ ఎడమ చేతిని అవతలివారి ఎడమ పాదముపై ఉంచి, ఆ చేతిమీదుగా తమ కుడి చేతిని అవతలవారి కుడి పాదముపై వుంచి ముమ్మారు కళ్ళకు అడ్డుకోవాలి.

56) పురుషులు మాత్రమే భూమిదాద అనిసాష్టాంగ నమస్కారము చేయవలెను.

57) స్త్రీలు వక్షఃస్థలం నేలమీద ఆన్చిన స్త్రీత్వం నశిస్తుంది కనుక మోకాళ్ళు నేలపై ఆన్చి, తమ యెడమ పాదము మీద కుడిపాదము ఆన్చి సాష్టాంగ నమస్కారము చేయాలి.

58) ఆలయములలో, సభలో, ప్రభువు సన్నిధానములో, పీఠాధిపతుల పన్నిధానములో వ్యక్తులకు ప్రత్యేకంగా నమస్కరించరాదు. వారే నమస్కారమునకు అర్హులు.

59) పాదములు తాకి దణ్ణం పెడితే, దణ్ణం పెట్టించుకున్న వారికి శక్తులు పోతాయి.

60) ముని సన్యాస వృత్తిలోనున్నవారు ఆశీర్వాదం చేయించుకొనరాదు.


61) పెద్దలు స్నానము చేయకుండ ఆశీర్వదించరాదు. కావున వారి స్నానానంతరమే నమస్కరించాలి.

62) ఉదయము తూర్పునకు తిరిగి పని ప్రారంభించవలెను. సాయంత్రం ఉత్తరమునకు తిరిగి ప్రారంభించవలెను.

63) తాంబూలము యిచ్చునపుడు, తమలపాకుల చివుళ్లు, అరటిపండ్ల చివుళ్లు పుచ్చుకొనేవారికి ఎదురుగా ఉండవలెను. లేనిచో తాంబూలం వ్యర్థము.

64) తమలపాకులు మూడు లేక ఐదు, వక్కలుగాని పండ్లుగాని రెండు పెట్టవలెను.

65) భోజనానంతరం తాంబూలం నూరు అడుగులు నడచి వేసుకొనవలెను.

65) తమలపాకుల మీద సున్నము చూపుడు వ్రేలుతో రాయకూడదు. బ్రొటన వ్రేలితో వ్రాయవలెను.

67) ఆలయమునకు, పెద్దల వద్దకు, పీఠాధిపతుల వద్దకు వివాహానికి, పురాణానికి మొ॥ వెళ్ళునపుడు చెప్పులు వేసుకొన కూడదు. (పాదచారిగ వెళ్ళవలెను కనుక)

68) పెద్దల దగ్గరకు, తపోవనమునకు వెళ్ళేటప్పుడు వినయ

విధేయతలతో వెళ్లాలి. అహంకారముతో వెళ్లాపాదు.

69) యజ్ఞోపవీతము దేహ విమోచనం వరకు వుండాలి.

70) యజ్ఞోపవీతమునకు నూలు పోగు ముడి పడితే బ్రహ్మహత్యా పాతకము అవుతుంది.

71) ఉపనయనమప్పుడు మొదటిది. స్నాతక వ్రతమప్పుడు రెండవది, వివాహములో అత్తమామలు మూడవది, పైమీద వస్త్రము లేకుండా వున్న దోష పరిహారార్థము నాలుగవది యజ్ఞోపవీతములు గృహస్థునకు.

72) నిద్రించునపుడు యెడమ చేతిని తలక్రింద పెట్టుకొని, యెడమ వైపునకు తిరిగి నిద్రించవలెను.

(సూర్యనాడి సంచరించుట వలన ఆరోగ్యము కలుగును.)

73) నులక మంచముపై పరుండునపుడు, కాళ్ళవైపు తల పెట్టి పరుండరాదు.

74) పట్టిమంచము నేయునపుడు బద్దెలు లెక్కపెట్టి నాలుగుతో భాగించగా శేషము ఒకటి వచ్చిన ఆయుర్ధాయము, రెండు వచ్చిన లక్ష్మి, మూడు వచ్చిన కీర్తి, సున్న వచ్చిన మరణము వచ్చును. కావున నాలుగుతో భాగించిన శేషము మిగులవలెను. నిలువుకి నిలువే లెక్క. అడ్డానికి అడ్డమే లెక్క

75) తడి కాళ్ళతో పరుండరాదు.

75) చెడు స్వప్నములు వచ్చిన వెంటనే లేచి, ఎండు పుడక గాని, తాటియాకు గాని తుంచి కాళ్ళు చేతులు కడుక్కొనినచో దోషము పోవును.

77) విశ్వామిత్ర సృష్టిలోవున్న వస్తువులను పితృకార్యములకు వాడరాదు. (వంకాయ, పెద్దగుమ్మడికాయ, పచ్చి మిరపకాయ, కరివేపాకు, గోంగూర, రెల్లు, కుంకుళ్ళు మొ॥)

84 లక్షల జీవరాసులలో గోవుయే పవిత్రమైనది. మలమూత్రములు కూడ పవిత్రమే అయిన జంతువదొక్కటే.

79) కొద్ది స్నేహాన్ని నడిపేవాడు స్నేహితుడు.

80) చిరకాలము స్నేహము చేసేవాడు మిత్రుడు.

81) కడుపులోని మాటను చెప్పుకొనేవాడు సుహృత్.

82) మానవుని కాలిబొటన వ్రేలు నాడి ఆగిన రెండు గంటలలో మరణించును.

83) దుఃఖమనగా ఆపినా ఆగకుండా వచ్చునది.

84) శోకమనగా దృశ్యమును చూచిన వచ్చునది.


85) ముక్కు వద్దనున్న కళ్ళమొదలు నుండి వచ్చు నీరు దుఃఖము. కళ్ళచివరనుండి వచ్చు నీరు ఆనందబాష్పములు.

86) సంస్కారమును బట్టి భోగము, కర్మను బట్టి జన్మ వచ్చును.

87) స్త్రీలకు బేసి సంఖ్యగల అక్షరములతో పేరులు పెట్టుట మంచిది.

88) పురుషులకు సరి సంఖ్యగల అక్షరములతో పేరులు పెట్టుట మంచిది.

89) గర్భిణీ స్త్రీ ఏడవమాసము తర్వాత ఏ భావనతో వుంటుందో ఆ భావనగల సంతానం కలుగుతుంది.

90) స్త్రీలు పరకార్యము చేయునపుడు, పరపురుషునితో మాట్లాడవలసి వచ్చినపుడు భర్తను తలచుకొని చేసిన దోషము వుండదు.

91) స్త్రీ కాలి బొటనవ్రేతిలో నేలపై వ్రాయరాదు.

92) భార్యచేసిన పాపంలో భర్తకు భాగముండదు. కాని భర్త చేసిన పుణ్యంలో భాగ్యకు సగం భాగం వుంటుంది. పాపంలో వుండదు.

93) మానవునికి బ్రహ్మజ్ఞానము కలవారి యందు భక్తి, శివపూజ, దానశీలత, సజ్జన సాంగత్యం, ఈ నాలుగు ఉండాలి.

94) భోజనము తక్కువ కాలంలో చేయవలెను.

95) దానము పాత్రత నెరిగి యిచ్చుట మంచిది.

96) అపాత్రునికి దానము చేసిన, వాడు చేసిన పాపము దానము చేసిన వారికి వచ్చును.

97) అతి దానము వలన పాడైనవాడు బలిచక్రవర్తి,

98) అతి కామం వలస పాడైనవాడు రావణుడు.

99) అతి లోభం వలన పాడైనవాడు దుర్యోధమడు.

100) అతి కోపము వలన పాడైనవాడు విశ్వామిత్రుడు. కావున అతి ఎప్పుడూ పనికిరాదు.


17

101) భగవద్గీత అందరూ చదువ వచ్చును.

102) వాల్మీకి రామాయణంలోని సుందరకాండ స్త్రీలు పఠించరాదు. (గాయత్రీ మంత్రము ఉన్నది గనుక)

103) ఉత్తమ మానవుడు తన బలము తనవారి బలము దైవబలము చూచుకొని కార్యము ప్రారంభించును.

104) మధ్యముడు తన బలము, తనవారిబలము చూచుకొనును.

105) అధముడు తన బలమే చూచుకొనును.

106) మాన, ప్రాణ రక్షణయందు ధర్మము చెడకుండ ధర్మ సూక్ష్మము పాటించవచ్చును.

107) శాశ్వత స్నేహము కోరువారు మూడు పనులు చేయరాదు. 1) వాగ్వివాదము 2) ధనము ఇచ్చి పుచ్చుకొనుట (అప్పు). 3) అతను లేని సమయమున అతని భార్యతో మాట్లాడుట.

108) ఎడమర నుండి తూర్పునకు ప్రవహించునది నది. తూర్పునుండి పడమరకు ప్రవహించునది నదము.

109) 5 సం.ల వరకు పిల్లల పాప పుణ్యములు తల్లి తండ్రులకు సంభవించును. కనుక లాలించి పెద్దచేయవలెను. తర్వాత 10 సం.లు శిక్షణలో ఉంచవలెను. 16 సం. లు వచ్చిన తర్వాత కుమారుని మిత్రునిగా చూడవలెను.

110) కుత్స అనగా తాను చేసిన పనివల్ల తనకు వచ్చు బాధ.

111) జ్ఞాని అజ్ఞాన నాశనాన్నే కోరుతాడు.

112) అవసరమైతేనే భూమిని త్రవ్వాలి. కారణము లేకుండా త్రవ్వితే ఉపపాతకమౌతుంది.

113) దాతృత్వము, ప్రియవక్తృత్వము. దీరత్వము. ఉచితఙ్ఞత ఇవి సహజమైనవి. నేర్చుకుంటే వచ్చేవికావు.

114) వనిత, పండితుడు, తీగ ఆశ్రయము లేనిదే రాణించరు.

No comments: