Adsense

Wednesday, April 3, 2024

పూర్వం బిడ్డను తొలిసారి అత్తగారింటికి పంపునప్పుడు చెప్పే బుద్దులు (కొన్ని దేశాలలో)




జపాన్ దేశంలో..

1. నీవు నా కూతురవుగావు, ఆ తింటికోడలువు ఇప్పుడు,

2. పెండ్లిఆయినందున నీవొకరి సొత్తువు, నీవాయజమాని ఆజ్ఞలను కనులకద్దుకొని సేవింపుము"

3. నీ అత్తగారిని సంతోష పెట్టుటవలన నీకు శాశ్వతమైన సంతోషము లభింప వీలుగలదు.

4. ఎవరితో విరోధము పెట్టికొనకుము ఓర్పులేనితనము, కపటము నీలో నుండఁదగవు•

5. ఒక వేళ నీ భర కోపపడినప్పటికిని నోరు పొడుగుగా పోనీయకుము. అతనికోపమును నీశాంతము వినయవిధేయతలతోను ప్రశంశా వాక్యములతోను నిమ్మలింపుము.

6. ఇంటిపనుల నేర్పుతో జక్కపెట్టుము. తగినట్లు ఏర్పాట్లు చేయుచుండుము, మితముగా ఖర్చు బెట్టుటను మరువవద్దు.

7. జ్యోతిష్కులతోను, మాంత్రికులతోను నీ కష్టములను గూర్చి సలహా తీసికొనకుము'

8. నిరాడంబరమైనవి, వెలతక్కువవిగానుండు శుభ్రమైన దుస్తులను ధరింపుము.

9. గర్వపడకుము. హెచ్చులు గొట్టకుము దీనివలన మానవులు గౌరవంగోల్పోయి హైక్యముపొందుదురు

10. నీతిల్లిదండ్రుల పదవులనుజూచియు, వారిధనధాన్య రాజ్యభోగ్యములను దలంచియు, విఱ్ఱవీఁగకుము' మఱియు నిట్టిమాటలను సగర్వముగా నీభర్తతో గాని, నీఅత్తగారివారగు నెవ్వరితోఁగానివచింపకుము"
అరేబియా దేశములో:-

1. ఓ బిడ్డా! నీవు సర్వదా తృప్తితోనుండుము. నీభర్త ఆజ్ఞలను శిరసావహింపుము.

2. నీభర్తయొక్క కన్నులమీఁదను, ముక్కుమీఁదరు నీదృష్టినుంచుము. అతనికన్నులు నీవలని చెడు పములు చూడకుండా, మంచిశీలముతో నుండుము. ఆతని నానిక నీవైపునుండి సుగంధమునే ఆఘ్రాణించునట్లు జాగ్రత్త వహింపుము

3. భర్త భుజించు సమయమునను నిద్రించసమయమునను మిక్కిలి ప్రసన్నతతోను, శాంతితోను, మృదువుగానుండుము, ఏలన మిక్కుట మైన ఆఁకలి మనుష్యుని భయంకరముగా మార్చివేయఁగలదు, ఆటులే నిద్రలోనున్న ప్పుడు పరిజ్ఞానములేకుండా మేల్కొలిపినప్పుడు, నిద్రను భంగము చేయునట్లు అల్లరి చేసిన ప్పుడును ప్రళయకారియైన కోపమునకు గుఱి కావలసియుండును.

4. నీభర్త ఆజ్ఞ గల్లంఘింపకుము. ఆతనిరిహస్యముల నొరులకు జెప్పకుము.

5. అతఁడు విచారముగా నున్నప్పుడు సంతోషమును, సంతోషముతో నున్నప్పుడు దుఃఖమును ప్రకటింపకుము.

6. ఆతని సంతోషమునకు నీసంతోషమునకంటె ప్రాముఖ్యము నొసఁగవలెను' అతని కోరికలను నీకోరి కలకంటె ముఖ్య మైనట్టివిగా నిశ్చయించి ఆచరింపుము ”

[ స్వీయ - "స్త్రీధర్మ” నుండి ] (సేకరణ)

No comments: