Adsense

Thursday, April 4, 2024

పూర్వం నీటి వైద్యం #water therapy (old)

జలమువలన పనేక రోగములు నయమగును. సమస్తరోగములు జలమువలన నే నయమగునను జర్మను పండితుని సిద్ధాంతానుసారము మనదేశమం దనేకులు నీటివైద్యమును చేయుచున్నారు. దానినే తొట్టిస్నానములని నుడువుదురు. ప్రాతః స్నానము సర్వరోగనివారణమనియు, సర్వపాపపరిహారమనియును ఆరోగ్యసాధనమనియు పెద్దలు చెప్పియున్నారు. ఆంధ్రదేశమున ప్రాతఃస్నానమొనర్చు యాచారము బ్రాహ్మ ణులయందు మాత్రముండెను. కాని యిటీవల యదితగ్గినది. మద్రాసు కలకత్తా మొదలగు ప్రదేశములయందు చదువుకొనివచ్చిన విద్యార్థులు ఉషఃకాలమున గాకున్నను స్నానానంతరమె కార్యరంగమున బ్రవేశింపుచున్నారు. ఇది శుభసూచక మేగాని స్త్రీల యందుమాత్ర మాయభ్యాసముతప్పిపోయినది. ప్రాతఃస్నానమును మఱచినారనుట యతి శయోక్తిగాదు. ప్రాతఃస్నానము వలన నారోగ్యము నృద్ధియగునని వేరుగనుడువుట యనా వశ్యకము. శరీరమునకు మెరుగుగ కొబ్బరినూనెను పూసి సూర్యోదయమునకు పూర్వము తలనిండ చన్నీటస్నానము చేయవలయును. చలి వేయదు. పిల్లలకుగూడ నటుల చేయించిన యెడల తలయందు పేలు, పుండ్లు, గజ్జి, దురద మొదలగునవి క్రమక్రమముగ నశించును. శరీరమునకు బలము గలుగును. మనస్సు వికసించును. కావున నాంధ్రదేశ మందలి స్త్రీలయభివృద్ధికై పాటుబడుశ్రీలీ విషయము బోధించి, తల్లులు పిల్లల యారోగ్య సాధనకు గడంగవలయును.
(1) తలపోటు, తలనొప్పివలన బాధపడుచుందువారు శిరమున జలముధారగను పోయవలయును. అందువలన బాధతగ్గును.

(2) ముక్కు నుండి నెత్తురుకారుచుండిన శీతలజలమును నాసికతోడ పీల్చవలయును. అందువలన నిది సాధారణముగ సయమగును.

(3) ప్రతిదిన ముదయమున శీతల జలమును నాసికతోడ వీల్చిన యెడల 'పీనస' 'స్వరభంగము' దొలంగును.

(4) వాతరోగులు, అజీర్ణగ్రస్తులు మలద్వారమున శీతల జలమును పిచికారి చేసిన మిక్కిలి మేలుగలుగును.

(5) ఉదరమునందు బాధ యేర్పడిన యెడల వేడినీటి కాపు బెట్టవలయును. అందువలన శీఘ్రముగ నా బాధ తొలగును.

(6) విరోచనబద్ధముగలవారు శయనించునప్పుడు శీతలజలమును, నిద్దుర లేవగనే వేడినీటిని ద్రావుచుండిన యెడల మలబద్ధము నశించును,

(7) పొంగు, ఆటలమ్మ, స్ఫోటకము మొదలగు చర్మరోగములవల్ల బాధపడు వారికి శీతల జలమున తడిపిన వస్త్రమును గప్పవలయును. అందువలన వారికా బాధ చాలవరకు లాఘనమగును.

(8) వేడినీటిని ద్రావిన యెడల వాంతియగును,

(9) శిశువులకు యీడ్పులు వచ్చినప్పుడు తలకు మంచుగడ్డను లేక శీతల జలమును ప్రయోగించిన యెడల మిక్కిలి మేలుగలుగును.

(10) స్పృహతప్పి పడిపోయినవారి మోముపైన చన్నీటిని గొట్టిన వానికి వెంటనే స్పృహవచ్చును. "దెబ్బతగిలినచోట తడిగుడ్డచుట్టుట మంచిమార్గము.

(11) చేతులుకాళ్లు కొంగర బోవుచుండినయెడల శీతలజలమును ధారగబోయ వలెను. లేకకల్లును పట్టివేయవలయును. అందువలన బాధచాలవరకు తగ్గును. మిక్కిలి దెబ్బతగిలి పడిపోయిన రోగిని పరుండ బెట్టి తలయొకింత క్రిందుగ నుండునట్లు చేసి వేడి నీటితో కాచినయెడల మిక్కిలి మేలుకలుగగలదు.

భూపతనమైన శిశువులకు శ్వాశనిరోధమందు సమయమున నీటి వైద్యముపక రించుము. ఒక భాండమందుష్ట జలమును, మఱియొక భాండమందు శీతల జలమునుంచి ఆశిశువును ప్రథమమున యువజలమున కంఠమువరకును ముంచి యొకనిముసముంచి పిమ్మట శీతలజల మందు కంఠమువరకుముంచి యొక నిముసము వరకునుంచి దీసిన యెడల శ్వాసవిడచును.

వాతరోగిని ప్రథమమున మంచి వేడినీటియందును, తర్వాత శీతలజలమందును ముంచినయెడల మిక్కిలి మేలుగలుగును. పడిశము బాధనందువారికి వేడినీటిస్నానము మిక్కిలి యుపకారి.

(- సేకరణ)

No comments: