Adsense

Monday, April 22, 2024

వంకాయ సివంగిపులుసు, వంకాయ సోమాసీ: ఎలా చేయాలి?

వంకాయ సివంగిపులుసు

లేతవంకాయలు అన్నీ ఒక్క మాదిరిగానున్నవి కొని నాలుగు చీలికలుగా తరిగివుంచవలెను. పిమ్మట జీలకర్ర, ధనియాలు, మిరపకాయలు, మెంతులు, మినప్పప్పు కొద్దిగా దోరగా వేయించవలెను. ఉప్పువేసి పైన చెప్పినవి కలిపి మెత్తగా దంచి గుండచేసియుంచి దానిలో అల్లం చిన్నముక్కలు తరిగి కలిపి ఆగుండను సంకాయలలో బాగా కూరవలెను. పిమ్మట కొంచెం ను ల కపువ్వు వేయించి గుండకొట్టి ఉంచవలెను. తరువాత మనకు కావలసినమట్టుకు పులుసు అనగా చింతపండుది పైన చెప్పిన వంకాయలను సదలివేయవలెను, కొద్దిగా మంట బాగా పెట్టవలెను. మొదట పులుసు తిరగబో పొయ్యిమీద ఉంచి బాగాకాగుతుండగా అందులో ఎయ్యవలెను. తరువాత కాయలు మెత్తగా ఉడికేవరకు ""నేపొయ్యవలెను. తరువాత కాయముచిక పట్టుకొన్న తేనెపట్టువలె కదిలీటట్టుఉండవలెను. పైన చెప్పిన నువ్వులపొడి వేసిదింపి వేడిచల్లారకుండ భుజించవలెను,
వంకాయ సోమాసీ: 

గోధుమలు బాగ మెత్తటి పిండివిసరి గట్టిగాతడపవలెను. తడుపునపుడు పిండికనరుకాకుండ కొద్దిగా ఉప్పునూర్ కలపవలెను. చాలగట్టిగా తడిపి పెట్టవలెను. మంచి కేతవంకాయలు, యెర్రగడ్డలు, పచ్చిమిరప కాయలు, కొత్తిమిరిఆకు, కరివేపాకు బాగా కడిగి పెట్టవలెను. వంకాయలు ముచికలుతీసి నాల్గుపక్షముగా తరిగి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమిరికూడ తరిగివుంచవలెను. ఉప్పుకొంచెము పసుపు నూనె ఆఅన్ని బద్దలకు బాగా పట్టించి సన్నటిశగమీద (ఆడుగున) ఒకగిన్నెలో నీళ్లుకొంచెము నూనెకొంచెము(చాల కొంచెం)వేసి ఉప్పురాసిన బద్దలు అందులో వేసి బాగా కుదిలించి పైన ఒక పళ్లెములో నీళ్లుపోసి ఉంచవలెను. పదినిమిషములు ఆయినతరువాత బాగా కుదిపి వంకాయలు ఎర్రగడ్డలు మెత్తపడినది లేనిది చూడవలెను. బాగా ఉడికినదాక అపుడపుడు కలుపుతు గరిటతో గాని కుదిలించిగాని కొంచెము శనగపిండి, కొద్దిగా బియ్యపుపిండి పైన చల్లవలెను. పిండిచల్లకపోతే కూర ఎర్రగడ్డలు వేరే సంకాయవేరే ఉండును. ఇపుడు ముద్దగా ఉండును, ఉడకగానే బాగా ఆర బెట్టి వుంచవలెను. గోధుమపిండికి కొంచెము నెయ్యిపట్టించి బాగా చేతికొద్ది మర్దన చేయవలెను. తరువాత కొంచెములావుగా పూరీపత్తి ఈవంకాయకూర (కజ్జికాయలకు కొబ్బెరపూర్ణము పెట్టి మడిచినట్లుగానే) ఈపూరీకికూడ కూర పెట్టిమడిచి వెంటనే చమురులో వేచవలెను. పూరీలు చేసుకొను టకుముందే చమురు బాగా కాగుతూఉండవలెను. పూరీలో కూర పెట్టినతరువాత తిరిగి పీటమీద పెట్టి నూనె కాగినదాక ఉండనిచ్చిన నీళ్లుకారి పూరీ పీటకు కరుచుకొనిపోవును. పూరి కూర పెట్టినవెంబడే చమురులో కాల్చవలెను. బహురుచి గా ఉండును.

No comments: