Adsense

Monday, April 22, 2024

చెన్న పురి చంద్ర కలా:, చంద్రకాంతలు: మాల్ పూరీ, రవ్వ సేమియా యిడ్లి :ఎలా తయారు చేయాలి?

చెన్న పురి  చంద్ర కలా: మాల్ పూరీ: 

గోధుమపిండి స్వంతముగ దయారు చేసినదియైన మిక్కిలి శ్రేష్ఠము. ఆంగడులలో దొరకునది అంత శ్రేష్టమైనది కాజాలదు. అంత రుచికరముగను వుండ జాలను. కావున మంచి గోధుములను దెచ్చి పిండి చేసి పూరీలవలె అప్పడములుగా తయారుకేసి. పంచదార, తీయదోస విత్తులు, బాదంపప్పు, ద్రాక్షపండ్లు, క పప్పు, కిస్తాపప్పు, ముంతమామిడిపప్పు, వీటినన్నిటిని సూరి, కొంచెముతీసి తయారుజేసిన అప్పడములోబెట్టి పైన దానితో నే మూతమూసి నేతిలో వేపి వుపయో గింపవలెను. మిక్కిలి రుచిగానుండును.
మాల్ పూరీ:

ఆరవీ సె మైదాపిండితెచ్చి ఒక పాత్రలో వేసి దానిలో కొంచెము మిఠాయిరంగువేసి నీళ్లతో చ్కొగా కలుపపలెను. కొంచెము సోడాగుండ, ఏలకులపొడి దానిలో కలుపపలెను. పొయ్యిమీద జిలేబీకళాయి (లోతులేనికధాయి) పెట్టి దానిలో నెయ్యి పోసి సలసల మరిగిన తరువాత చిక్కగా కలిపిన మైదాపిండి గరిటెతోతీసి అట్టుమాదిరిగా పోయవలయును. (మామూలు లోతుకళాయి ఉప యోగించిన పూరీ ముద్దకట్టి పాడగుకు పూరీ ఎల్లం గా వేగనీయవలయును. ఇ తకుముందు ఒక ఆరవీ సె పంచదార లేతపాకముపట్టి ఉంచుకోవలెను. వేగిన పూరీలను ఈపాకములో వేయపలయంను. తరు వాత వానినితీసి రెండు చట్రముల మధ్య పెట్టి అరి®లు నొక్కుట్లు నొక్కవలెను. ఆదియే తినుటకు సిద్ధ ముగానున్న మాల్ పూరీ. 

చంద్రకాంతలు:

మొట్టమొదట పెసరపప్పు నానవైచి పప్పువానిన తదుపరి రోటియందుబోసి మెత్తగా రుబ్బవలయు మెత్తగా మెదిగినపిండి గిన్నెలోనికితీయవలయును. అది అటులుఁడనిచ్చి మఱియొకగిన్నెలో బెల్లము మెత్తగా తరిగిపోసి ఆబెల్లముపైన ఉబ్బిన పిండిముద్ద ఉంచి పొయ్యిమీద పెట్టవలయును. పిండియు బెల్లము కలిసి కుతకుత ఉడుకుతూ ఉన్న సమయాన గరిటెతో కలుపుతూ ఉండవలయును. అప్పుడు పాకములాగ గట్టిపడును. తరువాత నున్ననిపీటకి నేయివ్రాసి ఆపిండి పీట పెవేసి సమానముగా చేయవలయును. అది చెల్లబడినచో చిన్నముక్కలుగా కోయవలెను, ఆకోసి ముక్కలను మసమస కాగుచున్న నూనెలో గాని, నేతిలోగాని వేసి కొంచెముగా ఉడికించినచో ఎఱ్ఱరంగువచ్చును. వీనినే చంద్రకాందెలు అందుడ. ఇవి తినుటకు చాల రుచికరము.

రవ్వ సేమియా ఇడ్లి :

గోధుమరవ్వలో పెరుగుబోసి గరిటజారుగాక లిపి కొంచెము నానబెట్టవలెను. ఇందు సీమియా ను వేయించి కలుపునది —
పిమ్మట ఇడ్డెను పాత్రలో ఇడ్లిమాదిరిగానే గుంట లలో ఆపిండింపోన్, ఆవిరిమీద ఉడికినపిదప దించు కొనునది -

ఇడ్లి పచ్చడి 

శనగపిండిలో పెరుగు పలుచగాకలిపి తాలింపు పెట్టి, ఉప్పు కలుపునది— ఈపచ్చడితో, ఇడ్లిలో కోయివేసికొని భుజింప రుచికరము,




No comments: