శ్రీ రామ దూత స్తోత్రం
రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష దంష్ట్రా కరాళం
రం రం రం రమ్య తేజం గిరి చలన కరం కీర్తి పంచాది వక్త్రం
రం రం రం రాజయోగం సకల శుభనిధిం సప్త భేతాళ భేద్యం
రం రం రం రాక్షసాంతం సకల దిశ యశం రామదూతం నమామి!
ఖం ఖం ఖం ఖడ్గ హస్తం విష జ్వర హరణం వేద వేదాంగ దీపం
ఖం ఖం ఖం ఖడ్గ రూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం
ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయ మకుటం మాయమాయా స్వరూపం
ఖం ఖం ఖం కాల చక్రం సకల దిశ యశం రామదూతం నమామి!
ఇం ఇం ఇం ఇంద్ర వంద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్య లాభం
ఇం ఇం ఇం సిద్ధి యోగం నతజన సదయం ఆర్య పూజ్యార్చితాంగం
ఇం ఇం ఇం సింహ నాదం అమృత కరతలం ఆది అంత్య ప్రకాశం
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకల దిశ యశం రామదూతం నమామి!
సం సం సం సాక్షి భూతం వికసిత వదనం పింగలాక్షం సురక్షం
సం సం సం సత్య గీతం సకల మునినుతం శాస్త్ర సంపత్కరీయం
సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్య తత్వ స్వరూపం
సం సం సం సావధానం సకల దిశ యశం రామ దూతం నమామి!
హం హం హం హంస రూపం స్ఫుట వికట ముఖం సూక్ష్మసూక్ష్మావతారం
హం హం హం అంతరాత్మం రవిశశి నయనం రమ్య గంభీర భీమం
హం హం హం అట్టహాసం సురవర నిలయం ఊర్ధ్వ రోమం కరాళం
హం హం హం హంస హంసం సకల దిశ యశం రామ దూతం నమామి!
No comments:
Post a Comment